బిగ్ బ్రేకింగ్.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్
- మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో తనిఖీలు
- గత సంవత్సరం అవినీతి ఆరోపణలపై డీటీవో సస్పెన్షన్
- సుమారు రూ. 3 కోట్లపైనే అక్రమాస్తులు..
అక్షరదర్బార్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలంరేపాయి. గతంలో మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారిగా పని చేస్తూ అవినీతి ఆరోపణలపై అరెస్టై సస్పెన్షన్‌కు గురైన గౌస్ పాషా ఇంట్లో శుక్రవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో నివాసం ఉంటుండగా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 2024 ఆగస్టులో మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషాపై ఏసీబీ కేసు నమోదైంది. ఈ కేసులో, ఏసీబీ అధికారులు గౌస్ పాషాను అదుపులోకి తీసుకుని విచారించారు. మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంపై దాడులు నిర్వహించి, గౌస్ పాషా ఇతర ఏజెంట్ల వద్ద రూ. 61,600 నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 3 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గతంలో అధికారులు గుర్తించారు. తాజాగా మరోమారు దాడులు నిర్వహించడం చర్చనీయమైంది.