కానిస్టేబుళ్ల ఆత్మహత్య
- ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ సూసైడ్
- మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్
- మరొకరు బెటాలియన్ కానిస్టేబుల్
- మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం
ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య
- మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్
- మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం
అక్షరదర్బార్, మెదక్:
వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, మరొకరు 17వ బెటాలియన్ కానిస్టేబుల్ బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే... ఆదివారం ఉదయం మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారుజామున వాకింగ్ కోసం ఇంటి నుంచి పోలీసు స్టేషన్ కు వచ్చిన సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సాయికుమార్ తన కుమార్తెకు ఫోన్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ బలవన్మరణంపై మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి విచారణ చేపట్టారు.
సిద్దిపేట వద్ద 17వ బెటాలియన్ కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వీరిలో కానిస్టేబుల్ బాలకృష్ణ చనిపోయాడు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంటి కోసం బాలకృష్ణ అప్పు చేసినట్లు సమాచారం. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఆత్మహత్యతో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం అలుముకుంది.