వరంగల్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ధడేల్.. ధడేల్
Published On
By SL
ధడేల్.. ధడేల్ * రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా * నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా దందా * అధికారుల అండతో బరితెగింపు.. * ఇష్టారాజ్యంగా మందుగుండుతో పేళుల్లు.. * మాయమవుతున్న గుట్టలు.. * యథేచ్చగా ప్రకృతి సంపద దోపిడీ.. * గతంలో మైనింగ్ సర్వే పేరుతో ఐదు లక్షలు నొక్కేసిన అధికారులు ! * ఎమ్మెల్యే జీఎస్సార్ ఆదేశాలు భేఖాతర్.. * ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు - అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని డిమాండ్ అక్షర దర్బార్, శాయంపేట : మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచుకెళ్తోంది. దీంతో క్రమక్రమంగా గుట్టలు మాయమైపోతున్నాయి. శాయంపేట మండలంలో కొందరు బడా వ్యక్తులు మైనింగ్ మాఫియాను నడిపిస్తున్నారు. తూతూమంత్రంగా అనుమతులు పొంది అక్రమంగా గుట్టలను మింగుతున్నారు. మరికొందరు లీజు గడువు ముగిసినప్పటికీ అధికారులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా శాయంపేట మండలంలో 'ప్రగతి' కోసం పేరు మారిన వాగు అవతల గల గ్రామంలోని ఓ క్రషర్ నిర్వాహకులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టపై నుండి 120 ఫీట్ల లోపల మందుగుండు సామాగ్రి అమర్చి బోర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని చెబుతున్నారు. బోర్ బ్లాస్టింగ్ వల్ల పెద్ద పెద్ద శబ్దంతో దుమ్ముధూళి అంతా ఇళ్లల్లోకి చేరుతోందని వాపోతున్నారు. బ్లాస్టింగ్ వాళ్ళ ఇళ్ల గోడలకు పగల్లు ఏర్పడుతున్నాయని, ఇంటిపై రేకులు పగిలిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. క్రషర్ యజమాని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.గుట్ట నుంచి కంకర గ్రానైట్ తవ్వకాల కోసం రెవెన్యూశాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ ఓ సి), భూగర్భ గనుల (మైనింగ్) శాఖ నుంచి లీజు పత్రంతోపాటు పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) నుంచి కన్సల్ట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ ఓ) అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ సదరు క్రషర్ నిర్వాహకులకు ఎలాంటి అనుమతులు లేవని సమాచారం. అంతేగాక మైనింగ్ చేయడానికి ఐదు హెక్టార్లకు మించితే స్థానికుల అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది. ఇవేమీ లేకుండా పీసీబీ, రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమన్వయంతో క్రషర్‌కు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. - రాత్రి, పగలు తేడా లేకుండా బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ చేయాలంటే మైనింగ్, పోలీసుల అనుమతితో పాటు స్థానిక ప్రజల ఇల్లు తదితర వాటిని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సదరు క్రషర్కు ఎలాంటి అనుమతులు లేకుండానే కంప్రెషర్ తో బ్లాస్టింగ్ చేస్తున్నారని పేలుడు ధాటికి ఇల్లు కంపించడంతోపాటు నెర్రలు బారుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. రాత్రిపగలు తేడా లేకుండా గుట్టలో బ్లాస్టింగ్ జరుగుతుండడంతో పొలాలకు వెళ్లే రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక సదరు క్రషర్ నుండి నిబంధనలకు విరుద్ధంగా కంకర, డస్ట్ అంతా టన్నుల కొద్ది తరలిపోతున్నది. నిత్యం వందలాది టిప్పర్లతో వచ్చే దుమ్ముతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రోడ్లు కూడా ధ్వంసం అవుపోతున్నదని స్థానికులు చెబుతున్నారు. - ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్ భూపాపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలను అధికారులు బేఖాతర్ చేస్తున్నారు. ఇటీవల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆయన మండలంలోని క్రషర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలో మైనింగ్ అంతా దుర్వినియోగం అవుతోందని, మైనింగ్ పై సర్వే చేయాలని అధికారులను ఆదేశించగా వారు క్రషర్ యజమానులతో ఐదు లక్షలతో డీల్ మాట్లాడుకుని కుమ్మక్కయ్యారని స్వయంగా ఎమ్మెల్యే ఆరోపించారు. క్రషర్ నుండి ఆదనపు మోతాదులో ట్రాక్టర్ టిప్పర్ వెళితే వాటిపై జరిమానా విధించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కానీ అధికారులు అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం మండలంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Read More... కల్తీ సరుకులు.. కాలంచెల్లిన ఉత్పత్తులతో నయా దందా..
Published On
By DS
వరంగల్‌లోని కిరాణషాపు యజమాని మాయాజాలం పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ దాడులు భారీగా కల్తీ, నకిలీ, కాలంచెల్లిన ఐటమ్స్ గుర్తింపు సుమారు రూ. 8 లక్షల విలువ గల 196 రకాల పదార్థాలు స్వాధీనం షాప్ యజమానిపై కేసు.. అక్షరదర్బార్, వరంగల్: టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో వరంగల్‌లోని సంతోష్ కుమార్ కిరణం & జనరల్ స్టోర్స్‌లో...
Read More... ఎంజీఎంలో మహిళా ఉద్యోగిపై దాడి కేసు..
Published On
By DS
అక్షరదర్బార్, వరంగల్ : వరంగల్ ఎంజీఎంలో ఉద్యోగిని కొట్టి బలవంతంగా డబ్బులు లాక్కున్న కిలాడీ లేడీని మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఏసీపీ నందిరాం నాయక్ అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బిల్ల సుమలత అనే మహిళ 15 సంవత్సరాల నుండి ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్‌లో రెండు ఏళ్లుగా పేషెంట్ కేర్‌గా ఉద్యోగం...
Read More... వరంగల్ బిడ్డ మరో ప్రపంచ రికార్డు
Published On
By DS
400 మీటర్ల టీ - 20 విభాగం ఫైనల్లో దీప్తికి కాంస్య పతకం స్వగ్రామం కల్లెడలో హర్షాతిరేకాలు వరంగల్ జిల్లాకు చెందిన యువ అథ్లెట్ దీప్తి జివాంజీ మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. పారీస్ పారాలింపిక్స్‌లో తెలుగు తేజం దీప్తి జివాంజి చరిత్ర సృష్టించారు. పారాలింపిక్స్ హిస్టరీలో పతకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా రికార్డులకెక్కారు....
Read More... ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత జగన్ హతం
Published On
By DS
స్వస్థలం టేకులగూడెంలో విషాదఛాయలు 1980వ సంవత్సరంలో పీపుల్స్‌వార్‌లో చేరిక అంచెలంచెలుగా కేంద కమిటీ స్థాయికి.. అక్షరదర్బార్, వరంగల్ : మావోయిస్టు అగ్రనేత, పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. కేంద్ర మిలిటరీ ఇంచార్జ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ బార్డర్ ఇన్చార్జిగా కొనసాగుతున్న రణదేవ్...
Read More... వరదలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..
Published On
By DS
సికింద్రాబాద్-విజయవాడ మధ్యనిలిచిపోయిన 25 రైళ్లు..అక్షరదర్బార్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షానికి జనజీవనం అతలాకుతలం అయింది. రోడ్లు, రైల్వేలైన్లు దెబ్బతినడంతో ప్రజా రవాణా స్తంభించింది. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి సమీపంలో భారీ వర్షానికి రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. పట్టాలపై కంకర కొట్టుకుపోవడంతో తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్ వరదనీటితో నిండిపోయింది. రైల్వే సిబ్బంది...
Read More... బిగ్ బ్రేకింగ్.. ఆకేరువాగులో సైంటిస్ట్ మృతదేహం లభ్యం
Published On
By DS
గల్లంతైన తండ్రీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు అక్షరదర్బార్, మహబూబాబూబాద్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది.. ఆదివారం ఉదయం కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రీ, కూతురు నూనావత్...
Read More... కమలంలో కదనోత్సహం
Published On
By RV
బలాన్ని పెంచుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు ఇప్పటికే పలువురు ముఖ్యుల చేరిక మానుకోటలో మాజీ ఎంపీ, వరంగల్ లో మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరాక పార్టీ ముఖ్యలను కలుస్తున్న అల్లూరి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలకు రమేష్ ప్లాన్ అరూరిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించనున్న బీజేపీ రమేష్ బీజేపీలో చేరనున్నట్లు ముందే 'అక్షరదర్బార్' పత్రికలో కథనం
Read More... కన్వర్షన్.. కలెక్షన్!
Published On
By RV
లొసుగులను క్యాష్ చేసుకుంటున్న తహసిల్దార్లు అక్రమార్జన కోసం రియల్టర్లతో మనీ దోస్తీ ముందస్తు అవగాహన చేసుకొని రిజిస్ట్రేషన్లు మూడు ప్లాట్లు రూ.ఆరు కోట్లుగా అక్రమ దందా రజనీ ఇంట్లో ఏసీబీ సోదాలతో మరోసారి తెరపైకి..
Read More... ఆర్ఐ... మహా ముదురు
Published On
By RV
ఇటీవలే బదిలీపై ఓ కొత్త మండలంలో అడుగు ఆయన డ్యూటీకి ఎప్పుడొస్తారో తెలియని స్థితి తీరా వచ్చాక ముడుపులు ముడితేనే వెరిఫికేషన్ భూపాలపల్లి జిల్లాలో మరికొందరిదీ ఇదే తీరు
Read More... షిఫ్టింగ్... చీటింగ్
Published On
By RV
సీఎంఆర్ డెలివరీలో సరికొత్త దందా గడువులోగా సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లర్లు సర్కార్ ఇచ్చిన ధాన్యం మార్కెట్ కు తరలింపు గడువు ముగిసే సమయంలో షిఫ్టింగ్ ప్లాన్ కాగితాలపైనే ధాన్యం బదిలీ సహకరిస్తున్న సివిల్ సప్లై అధికారులు చేతులు మారుతున్న ముడుపులు
Read More... సత్తెన్న... సద్దిమూట
Published On
By RV
- సర్పంచి నుంచి శాసనసభ్యుడి వరకు - ఆర్ఎస్ యూ నుంచి అసెంబ్లీ వరకు జర్నీ - అంచెలంచెలుగా ఎదిగిన గండ్ర సత్యనారాయణ - ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు జనం మధ్యే - నియోజకవర్గం కుటుంబం... ప్రజలే కుటుంబ సభ్యులు - ప్రజా సమస్యలు, భూదందాలపై అలుపెరగని పోరు - భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్సార్ పై స్పెషల్ స్టోరీ ( ఈ-పేపర్ )
Read More...