ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గండ్ర..

ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గండ్ర..

ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గండ్ర.. 
 
*గత పాలకులు మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు*
 
*గత పాలకులు శాయంపేటలో అంబులెన్స్ ఇవ్వలేని పరిస్థితి*
 
-ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
 
అక్షర దర్బార్ శాయంపేట 
 
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శాయంపేట అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాని కష్టమే నా వృత్తి నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం మట్టిలో కలిసేదాకా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పేదవాళ్లే నా వృత్తిగా పనిచేస్తా అని అన్నారు. గత పాలకులు మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు చేశారు. అప్పుచేసి ఎవరికి ఒరగబెట్టారంటే దళిత గిరిజన కుటుంబాలకు మూడెకరాలు ఇస్తానని ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదు ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ యువతులు చనిపోయిన కూడా గత ప్రభుత్వ ముఖ్యమంత్రి పరామర్శించలేదు అని అన్నారు. కడుపు కట్టుకొని నిజాయితీగా 6 గ్యారంటీలో ఐదు అమలు చేశాం ఇంకొకటి అతి త్వరలో అమలు చేయబోతున్నాం అని అన్నారు. ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేదు. పోయినోడు అప్పులు చేసిపోతే  7 లక్షల కోట్లకు నెలకు మిత్తి 6,500 కోట్లు మిత్తి కడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదలకు ఇచ్చిన మాట కట్టుబడి నిజాయితీగా కడుపు కట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అందరం నిజాయితీగా పని చేస్తున్నామని అన్నారు. గతంలో శాయంపేట లో గోడకూలి అంబులెన్స్ ఫోన్ చేస్తే చనిపోయిన తర్వాత అంబులెన్స్ వచ్చిందని అంబులెన్స్ ఉంటే పేదవాడి ప్రాణం కాపాడేది అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీగా శాయంపేట మండలం కి అంబులెన్స్ ని ఇవ్వడం జరిగిందన్నారు. రాబోవు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియాలని అన్నారు.
 
*మాజీ ఎమ్మెల్యే పై విరుచుకుపడిన  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు*
 
భూపాల్ పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గాంధీనగర్ గుట్టను లీజుకు తీసుకుంటే ఆ లీజును క్యాన్సిల్ చేసి దళిత గిరిజన బిడ్డలకు 146 కోట్లతో హాస్టల్ భవనం కడుతున్నామన్నారు. గతంలో పెద్ద పదవి వచ్చి లబ్బర్ సింగ్....అబ్బర్  సింగ్ లెక్క బుయ్యి... బూయ్యిమని.. కార్లు వేసుకొని విప్ లుగా  తిరిగారు. శాయంపేటలో అంబులెన్స్ ఇవ్వలేని వ్యక్తులు ఏం ఒరగబెట్టారు అని అడుగుతున్నా అన్నారు.IMG-20241208-WA1287
Tags:

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..    ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి    అక్షర దర్బార్, శాయంపేట       ఆయిల్ పంట ఫామ్ దగ్ధం
Read More...
ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల పంజా..

ఐఈడీ బాంబుతో భద్రతా బలగాల‌ వాహనం పేల్చివేత  8 మంది జ‌వాన్లు, డ్రైవ‌ర్ మృతి మ‌రికొంద‌రికి తీవ్ర గాయాలు ధృవీక‌రించిన బ‌స్త‌ర్ ఐజీ  అక్ష‌ర‌ద‌ర్బార్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ :...
Read More...
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల పంజా..

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

   పీడీఎస్ రైస్ వ్యాపారిని రూ.4 లక్షల డిమాండ్  రూ.2 లక్షలు  తీసుకున్నారనే ఆరోపణలు  విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కలకలం 
క్రైమ్ 
Read More...
సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

రెండు రాష్ట్రాల సరిహద్దులో కలకలం మావోలు అమర్చిన ప్రెజర్ బాంబు పేలి ఒకరికి గాయాలు ముత్యందార జలపాతం అటవీ ప్రాంతంలో ఘటన
క్రైమ్ 
Read More...
మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

పేకాట రాయళ్ళు అరెస్టు

*పేకాట రాయళ్ళు అరెస్టు*    -ఇద్దరు వ్యక్తులు అరెస్టు, ఇద్దరు పరారు    అక్షర దర్బార్, శాయంపేట  గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్...
Read More...
పేకాట రాయళ్ళు అరెస్టు