ఎస్పీ, జ‌డ్జి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం.. ఎందుకంటే ?

ఎస్పీ, జ‌డ్జి చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం.. ఎందుకంటే ?

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మహబూబాబాద్ : జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, న్యాయమూర్తి తిరుపతి చిత్రపటాలకు ఓ వ్య‌క్తి పాలాభిషేకం చేసి త‌న అభిమానం చాటుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు ఇప్పిస్తానంటూ దళారి తీసుకున్న రెండు లక్షల  రూపాయలను తిరిగి ఇప్పించి లోక్ అదాలత్ లో ఇరువురి కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినందుకు కృత‌జ్ఞ‌త‌గా మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఎదుట చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..  కురవి మండలం గుండ్రాతి మడుగు (విలేజ్)కు చెందిన పత్తి  వెంకన్న తన కుమారుడికి హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు కోసం మేడ్చల్‌కు చెందిన ఓ వ్య‌క్తికి రూ. 2 లక్షలు ఇచ్చాడు. సీటు ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితుడు కురవి పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశారు. కురవి ఎస్ఐ సతీష్ బాధ్యతాయుతంగా స్పందించి దళారిని పోలీస్  స్టేషన్‌కు తీసుకువచ్చి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశాడు. ఈమేర‌కు జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఇరువురి కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చి డబ్బులను ఇప్పించి కేసు పరిష్కరించారు. పోయాయనుకున్న రెండు లక్షల రూపాయలను తిరిగి తనకు అందేలా చేసిన జిల్లా ఎస్పీ, న్యాయమూర్తిల చిత్రపటాలకు మహబూబాబాద్‌లోని కోర్టు ఎదుట బాధితుడు పత్తి వెంకన్న పాలాభిషేకం నిర్వహించి తన కృతజ్ఞత చాటుకున్నారు. 

Tags:

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..    ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి    అక్షర దర్బార్, శాయంపేట       ఆయిల్ పంట ఫామ్ దగ్ధం
Read More...
ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల పంజా..

ఐఈడీ బాంబుతో భద్రతా బలగాల‌ వాహనం పేల్చివేత  8 మంది జ‌వాన్లు, డ్రైవ‌ర్ మృతి మ‌రికొంద‌రికి తీవ్ర గాయాలు ధృవీక‌రించిన బ‌స్త‌ర్ ఐజీ  అక్ష‌ర‌ద‌ర్బార్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ :...
Read More...
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల పంజా..

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

   పీడీఎస్ రైస్ వ్యాపారిని రూ.4 లక్షల డిమాండ్  రూ.2 లక్షలు  తీసుకున్నారనే ఆరోపణలు  విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కలకలం 
క్రైమ్ 
Read More...
సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

రెండు రాష్ట్రాల సరిహద్దులో కలకలం మావోలు అమర్చిన ప్రెజర్ బాంబు పేలి ఒకరికి గాయాలు ముత్యందార జలపాతం అటవీ ప్రాంతంలో ఘటన
క్రైమ్ 
Read More...
మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

పేకాట రాయళ్ళు అరెస్టు

*పేకాట రాయళ్ళు అరెస్టు*    -ఇద్దరు వ్యక్తులు అరెస్టు, ఇద్దరు పరారు    అక్షర దర్బార్, శాయంపేట  గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్...
Read More...
పేకాట రాయళ్ళు అరెస్టు