సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

 

  • పీడీఎస్ రైస్ వ్యాపారిని రూ.4 లక్షల డిమాండ్ 
  • రూ.2 లక్షలు  తీసుకున్నారనే ఆరోపణలు 
  • విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కలకలం 

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

అక్షరదర్బార్, తొర్రూరు:
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు జరిపారు. తొర్రూరు సీఐ కే జగదీష్ ను అరెస్టు చేశారు. గత సంవత్సరం దంతాలపల్లి వద్ద అధికారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడి నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసి రూ.2లక్షలు తీసుకున్నారని, నిందితుడిని అరెస్టు చేయటం లేదనే ఆరోపణలు సీఐపై వచ్చాయి. మిగతా డబ్బు కోసం తనకు కాల్ చేస్తుండటంతో నిందితుడు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తుంది. తొర్రూర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సిఐ జగదీష్ ను కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం వ్యవహారంలో ఒక పోలీస్ అధికారిని ఏసీబీ అధికారులు అరెస్ట్  చేయడం సంచలనం కలిగించింది.

Tags:

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..    ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి    అక్షర దర్బార్, శాయంపేట       ఆయిల్ పంట ఫామ్ దగ్ధం
Read More...
ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల పంజా..

ఐఈడీ బాంబుతో భద్రతా బలగాల‌ వాహనం పేల్చివేత  8 మంది జ‌వాన్లు, డ్రైవ‌ర్ మృతి మ‌రికొంద‌రికి తీవ్ర గాయాలు ధృవీక‌రించిన బ‌స్త‌ర్ ఐజీ  అక్ష‌ర‌ద‌ర్బార్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ :...
Read More...
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల పంజా..

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

   పీడీఎస్ రైస్ వ్యాపారిని రూ.4 లక్షల డిమాండ్  రూ.2 లక్షలు  తీసుకున్నారనే ఆరోపణలు  విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కలకలం 
క్రైమ్ 
Read More...
సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

రెండు రాష్ట్రాల సరిహద్దులో కలకలం మావోలు అమర్చిన ప్రెజర్ బాంబు పేలి ఒకరికి గాయాలు ముత్యందార జలపాతం అటవీ ప్రాంతంలో ఘటన
క్రైమ్ 
Read More...
మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

పేకాట రాయళ్ళు అరెస్టు

*పేకాట రాయళ్ళు అరెస్టు*    -ఇద్దరు వ్యక్తులు అరెస్టు, ఇద్దరు పరారు    అక్షర దర్బార్, శాయంపేట  గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్...
Read More...
పేకాట రాయళ్ళు అరెస్టు