బీసీల లెక్క తేలింది.. మొత్తం జ‌నాభాలో స‌గానికిపైగా వీళ్లే.. ఎంత శాతం అంటే ?

బీసీల లెక్క తేలింది.. మొత్తం జ‌నాభాలో స‌గానికిపైగా వీళ్లే.. ఎంత శాతం అంటే ?

  • కేబినెట్ స‌బ్ క‌మిటీకి నివేదిక అంద‌జేత‌
  • ఈనెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ
  • అదేరోజు అసెంబ్లీ ప్ర‌త్యేక‌ స‌మావేశంలో ఆమోద ముద్ర‌

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది. మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85 శాతం ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. దీంతోపాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. 1500 పేజీలతో సర్వేకు సంబంధించిన వివరాలతో నివేదికను రూపొందించారు. ఈమేర‌కు సమగ్ర కుల సర్వే వివరాల నివేదికను ఆదివారం మధ్యాహ్నం మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు అందజేశారు. కేబినెట్ స‌బ్ క‌మిటీ చైర్మ‌న్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సచివాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్లానింగ్ క‌మిష‌న్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సందీప్ సుల్తానియా బృందం కేబినెట్ స‌బ్ క‌మిటీకి కుల గ‌ణ‌న నివేదికను అంద‌జేసింది. కాగా, ఈనెల 5న కేబినెట్ ముందుకు కుల గ‌ణ‌న నివేదిక రానుంది. మంత్రివ‌ర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, బీసీల రిజర్వేషన్లపై తీర్మానం చేసి.. కేంద్రానికి పంపనున్నారు.

 

Tags:

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌ సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు.. అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు