అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం..
అంతా అధికార పార్టీ నాయకుల ఇష్టం:ఏవో గంగా జమున.
అక్షర దర్బార్,శాయంపేట
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఖండించారు. ఆదివారం నాడు శాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి పార్లమెంటులో అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్ అని పదే పదే ప్రస్తావించడం కంటే, అందుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం దొరుకుతుందని మాట్లాడటం దేశ ప్రతిష్టతకు మంచిది కాదని అన్నారు. వెంటనే వారి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.
అనంతరం 19 మంది సీఎంఆర్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రైతు వేదికలో ఉచిత వరి విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది.
కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం..
మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో రైతు వేదిక ముందే ఓ మాజీ ప్రజా ప్రతినిధి వాగ్వాదానికి దిగారు. అయితే సబ్సిడీ విత్తనాల పంపిణీలో నాయకుల పేర్లు ఎంపిక చేయడం సరేంది కాదని పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ను కొంతమంది గ్రామానికి చెందిన నాయకులు నిలదీశారు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోని అక్కడినుండి వెళ్ళిపోయారు.
అంతా అధికార పార్టీ నాయకుల ఇష్టం:ఏవో గంగా జమున.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వరి విత్తనాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా ఆదివారం నాడు పంపిణీ చేయడం జరిగింది. ఉచిత వరి విత్తనాలను ఏ ప్రాతిపదికన ఇచ్చారు అని విలేకరులుగా అడగగా అంతా అధికార పార్టీ నాయకులు వారి ఇష్టం. అధికార పార్టీ నాయకులు చెప్పింది చేయకపోతే మేము పనులు చేయలేమని గతంలో కూడా బిఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు నడుచుకున్నాం. మా చేతుల్లో ఏమీ లేదు అని మండల వ్యవసాయ శాఖ అధికారి గంగా జమున అనడం కొసమెరుపు.