బిగ్ బ్రేకింగ్... ఎల్కతుర్తి ఎస్సైపై వేటు
- విధుల్లో నుంచి రాజ్‌కుమార్ సస్పెన్షన్
- ఉత్తర్వులు జారీచేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా
- ఎస్సైపై కొంతకాలంగా అవినీతి ఆరోపణలు
- అక్రమాస్తుల కూడబెట్టారని విమర్శలు
అక్షరదర్బార్, హన్మకొండ: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్సై రాజ్‌కుమార్‌పై వేటు పడింది. విధుల్లో నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు. ఎస్సై రాజ్‌కుమార్‌పై కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. భూతగాదాల్లో తలదూర్చుతున్నాడనే ఫిర్యాదులు సైతం ఉన్నతాధికారులకు చేరినట్లు సమాచారం. అంతేగాక.. ఇటీవల అక్రమాస్తులు కూడబెట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలోనే ఎస్సైపై సస్పెన్షన్ వేటుపడటం డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశమైంది. కమిషనరేట్ పరిధిలోని మరికొందరిపైనా త్వరలోనే సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటి వరకు ఎల్కతుర్తిలో ఎస్సైగా విధులు నిర్వహించిన ఏ అధికారి కూడా సస్పెన్షన్‌కు గురైన చరిత్ర లేదని.. ఇదే తొలిసారి అని సమాచారం.