కత్తులు, రాడ్లతో చంపారు
- ఇప్పటివరకు పదిమంది నిందితుల గుర్తింపు
- ఏడుగురు నిందితుల అరెస్ట్
- మరో ముగ్గురు నిందితుల పరార్
- ఆ ముగ్గురిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
- ఏ 8 గా కొత్త హరిబాబు
- వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
రాజలింగమూర్తి హత్య కేసు ఛేదించిన పోలీసులు
ఏడుగురు నిందితుల అరెస్ట్.. పరారీలో మరో ముగ్గురు
భూమి తగాదనే హత్యకు కారణం
అక్షరదర్బార్, హన్మకొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి ఈ రోజు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిలో రేణిగుంట్ల సంజీవ్, పింగిలి సేమంత్, మోరే కుమార్, కొత్తూరు కిరణ్, రేణిగుంట్ల కొమురయ్య, దాసరపు కృష్ణ, రేణిగుంట్ల సాంబయ్య ఉన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పుల్ల నరేష్, పుల్ల సురేష్ పరారీలో ఉన్నారు. ఎకరం భూమి విషయంలో తగాదానే రాజలింగమూర్తి హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.
ఈ పత్రికా సమావేశంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, చిట్యాల సిఐ మల్లేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి గణపురం, రేగొండ, టేకుమట్ల ఎస్బి లు సాంబమూర్తి, రమేష్, అశోక్, సందీప్, సుధాకర్, రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.