మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

  • రెండు రాష్ట్రాల సరిహద్దులో కలకలం
  • మావోలు అమర్చిన ప్రెజర్ బాంబు పేలి ఒకరికి గాయాలు
  • ముత్యందార జలపాతం అటవీ ప్రాంతంలో ఘటన

ప్రెజర్ బాంబు కలకలం
- ముత్యందారా జలపాతం వద్ద పేలిన ప్రెజర్ బాంబు 
- ఒకరికి తీవ్ర గాయాలు

అక్షరదర్బార్, ములుగు: 
ప్రెజర్ బాంబు మరోసారి ములుగు జిల్లాలో కలకలం సృష్టించింది. వెంకటాపురం (నూగూరు) మండలం వీరభద్రవరం ముత్యందార జలపాతం సమీపంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు పేలి ఆదివారం నాగరాజు అనే వ్యక్తి గాయపడ్డారు. కట్టెల కోసం అడవికి వెళ్ళిన నాగరాజు కాలినడకన వెళ్తున్న సమయంలో ప్రెజర్ బాంబు పేలినట్లు తెలిసింది. తమకోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు అడవిలో ఇక్కడ ఈ ప్రెజర్ బాంబు అమర్చినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా నాగరాజు కట్టెల కోసం అడవిలోకి వెళ్లడం వల్ల పోలీసుల కోసం మావోయిస్టులు అమర్చిన ఈ ప్రెజర్ బాంబు పేలి నాగరాజు గాయపడినట్లు సమాచారం. గాయాలతో బయటపడిన నాగరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. రెండు రాష్ట్రాల సరిహద్దులో కొద్ది నెలల నుంచి పోలీసులు, మావోయిస్టుల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏటూరునాగారం మండలంలోని ఐలాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం కూడా విధితమే. ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసుల గాలింపు సాగుతుంది. ఈ క్రమంలో తాజాగా ముత్యందార జలపాతం సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు పేలటంతో నాగరాజు గాయపడటం స్థానికంగా కలవరం రేపింది. గత సంవత్సరం జూన్ లో మావోయిస్టులు కర్రెగుట్టపై అమర్చిన ప్రెజర్ బాంబు పేలి ఇదే వెంకటాపురం మండలం మండలం చొక్కాల గ్రామానికి చెందిన మహిళ సునీత గాయపడగా, అదే నెలలో కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ప్రెజర్ బాంబు పేలి వాజేడు మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు మరణించారు. ఈ ప్రెజర్ బాంబులు మావోయిస్టులు పోలీసుల కోసం అమర్చినవే కావటం గమనార్హం.

- అమాయకులను టార్గెట్ చేస్తున్న మావోయిస్టులు... ఎస్పీ శబరిస్

వెంకటాపురం మండలంలో వీరభద్రవరం ముత్యందార జలపాతం సమీపంలో పేలిన ప్రెజర్ బాంబు ఘటనపై ములుగు ఎస్పీ శబరిస్ స్పందించారు. ఆయన మాటల్లో... 

మందుపాతర పేలి అమాయక ఆదివాసీ యువకుడికి తీవ్ర గాయలు. 

అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే అమాయక ఆదివాసీల ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టులు..

మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడంలో బాగంగా సాధారణ ప్రజలను, యాత్రికలను, భక్తులను, అటవీ ఉత్పత్తుల సేకరణకి వెళ్లే ఆదివాసీలను సైతం టార్గెట్ చేస్తూ ప్రజలు నిత్యం నడిచే కాలి బాటల వెంబడి మందుపాతరలను అమర్చి వారి ప్రాణాలను బలిగొంటున్నారు. 

కర్రేగుట్టలను గేర్రిల్లా బేస్ గా మార్చే ప్రయత్నంలో బాగంగా మావోయిస్టులు అమాయక ప్రజలను టార్గెట్ చేస్తు  మందుపాతరలు అమర్చుతున్నారు.

వెంకటాపురం, వాజేడు మండలలోని ప్రజలు అటవీలోకి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా అనుమానస్పదంగా మందుపాతరలు కనిపిస్తే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని ములుగు ఎస్పీ శబరిస్ ప్రజలకి తెలిపారు

ప్రజలు ఎవరు బయపడవద్దని ములుగు ప్రజల రక్షణ కోసం ములుగు పోలీస్ నిరంతరం పనిచేస్తున్నారని..

బాంబు డిస్పాసల్ తనిఖీ బృందాలతో నిరంతరంగా కర్రేగుట్ట అటవీ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారని..

ఇలాంటి చట్టవ్యతిరేక పనులకి పాల్పడుతున్న మావోయిస్టులకి ప్రజలు ఎవరు సహకరించవద్దు.

ఇటువంటి అమాయక ఆదివాసీల మీద జరుగుతున్న దాడులు పునరావృతం కాకుండా ప్రజా సంఘాలు ఈ సంఘటనపై స్పందించాలని ములుగు ఎస్పీ శబరిస్ తెలిపారు

Tags:

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..    అంజన్న ఆశీస్సులు తండా ప్రజలమీద ఉండాలి.    - మాజీ సర్పంచ్ భూక్యా రమేష్    అక్షర దర్బార్, శాయంపేట     అంజన్న ఆశీస్సులు తండా...
Read More...
అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్య‌క్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా శివారులో టీ పార్థసారథి (42) అనే వ్యక్తిని...
క్రైమ్  వరంగల్ 
Read More...
గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం