ఫ్లాష్.. ఫ్లాష్.. ఎస్సారెస్సీ కెనాల్‌లో పడిన కారు
బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు
- కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు
- వరంగల్ జిల్లా తీగరాజుపల్లి వద్ద ఘోర ప్రమాదం
- గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు
అక్షరదర్బార్, వరంగల్:
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ (30)తోపాటు ఆయన కూతురు ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కొడుకు చిన్నారి సాయివర్దన్ (2) మృతి చెందగా భార్య ను స్థానికులు కాపాడారు. వరంగల్‌లో నివాసం ఉంటున్న ప్రవీణ్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలోనే సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కెనాల్‌లో వీరు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది. దీంతో ప్రవీణ్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు తాడు సాయంతో భార్య కృష్ణవేణిని కాపాడారు. అప్పటికే బాలుడు సాయివర్దన్ మరణించాడు. ప్రవీణ్, ఆయన కూతురు చైత్ర సాయి (4) కారు సహా నీటిలో గల్లంతయ్యారు. డ్రైవింగ్ సమయంలో ప్రవీణ్ కు చెస్ట్ పెయిన్ రావడంతో కారు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయినట్లు తెలుస్తుంది. పోలీసులు గల్లంతయిన తండ్రీ కూతురు కోసం గాలిస్తున్నట్లు సమాచారం. సోమారపు ప్రవీణ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.