పునర్నిర్మాణంలో భాగస్వాములం అవుదాం
- రెవెన్యూ వ్యవస్థపై డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్
- గత ప్రభుత్వ విధానాలతో రెవెన్యూ వ్యవస్థ ధ్వంసమైందని ఆవేదన
- వరంగల్ లో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
పునర్నిర్మాణంలో భాగస్వాములం అవుదాం
- రెవెన్యూ వ్యవస్థపై తెలంగాణా డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్, టీజీటీఏ అధ్యక్షుడు లచ్చిరెడ్డి
- గత ప్రభుత్వ విధానాలతో రెవెన్యూ వ్యవస్థ ధ్వంసమైందని ఆవేదన
- వరంగల్ లో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
అక్షరదర్బార్, వరంగల్:
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్, తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ లోని ఐశ్వర్య గార్డెన్ లో జరిగిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన లచ్చి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలతో ఎలా రెవెన్యూ వ్యవస్థ ను ధ్వంసం చేశారు, రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొన్న అవమానాలను, మన తోటి ఉద్యోగులు రాత్రికి రాత్రి ఎలాంటి సర్వీస్ కాని వయసు గానీ అర్హతలను తీసుకోకుండా 5200 మంది వీఆర్వోలను వేరే శాఖలోకి నిరంకుశ ధోరణితో పంపించడం జరిగిందని అన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు వేరే శాఖలోకి వెళ్ళిన సందర్భంలో రెవెన్యూ శాఖలో గ్రామస్థాయిలో పనిచేసే అధికారులు లేక రెవెన్యూ ఉద్యోగులు అనగా తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు నానా రకాలుగా ఇబ్బందులకు గురైనారని, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రాథమిక విచారణ చేసి నివేదిక సమర్పించే అధికారులు లేకపోవడం, ప్రభుత్వ భూముల ఆక్రమణలను పసిగట్టడంలో వైఫల్యం పొందిందని, ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించి నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసేలా రెవెన్యూ వ్యవస్థ పునర్ వైభవంలో ప్రతి ఒక రెవెన్యూ ఉద్యోగి భాగస్వామి కావాలని లచ్చిరెడ్డి కోరారు.
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ ఉద్యోగుల మీద ఉంది
- టీజీటీఏ స్టేట్ జనరల్ ప్రెసిడెంట్ రమేష్ పాక
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అమలుపరిచే ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత రెవెన్యూ ఉద్యోగుల మీద ఉందని, అలాంటి రెవెన్యూ వ్యవస్థ పునర్ నిర్మాణం, పునర్ వైభవం తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేసి ధరణి 2020 మూలంగా సామాన్య రైతు తను కోల్పోయిన భూములను పొందాలంటే కోర్టుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారని, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి పట్టాదార్ పాస్ బుక్కులు జారీ చేసే అధికారం తాసిల్దార్ కు, ఆర్ డిఓకు కల్పించడం చాలా శుభ పరిణామమని రమేష్ పాక అన్నారు.
- టీజీటీఏ స్టెట్ జనరల్ సెక్రటరీ: ఫూల్ సింగ్ చౌహాన్:
దేశంలోనే పలు రాష్ట్రాల రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణ ప్రజల భౌగోళిక స్వరూపాన్ని బట్టి దానికి అనుకూలమైనటువంటి నూతన రెవెన్యూ చట్టం భూభారతి అవసరం ఎంతైనా ఉన్నదని, తెలంగాణ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాాలు జారీ చేయుటకు ఎలాంటి సమస్య అయినా మండల స్థాయిలో పరిష్కరించుటకు భూభారతి చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫూల్ సింగ్ చౌహాన్ అన్నారు.
- తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ సభ్యత్వం కొరకు ఆప్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభం
- టీజీటీఏ స్టేట్ ప్రెసిడెంట్ : రాములు
మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ TGRSA సభ్యత్వ నమోదు యాప్ కార్యక్రమాన్ని లచ్చిరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా ప్రారంభించారు. ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి రెవెన్యూ సంక్షేమం కొరకు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కొరకు ఆప్ లో సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు.
- టీజీటీఏ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్: మొహ్మద్ ఇక్బాల్
గతి ప్రభుత్వ హయాంలో వీఆర్ఏలను రెండు వర్గాలుగా విభజించి 60 సంవత్సరాల లోపల ఉన్న వారికి జూనియర్ అసిస్టెంట్ లుగా పోస్టింగ్ లు ఇచ్చారని, 61 సంవత్సరాలు దాటిన వారికి ఇంకా పోస్టులు ఇవ్వకుండా పెండింగ్లో ఉన్నందున వారి సమస్యను సానుకూలంగా స్పందించి పెండింగ్ లో ఉన్న 3,797 మంది వీఆర్ఏలకి పోస్టింగ్ లు ఇప్పించాలని TGTA స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ మొహ్మద్ ఇక్బాల్ కోరారు.
- టీజీటీఏ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ: విక్రమ్ కుమార్
అదే విధంగా ఇంకా పెండింగ్ లో ఉన్న 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ, చనిపోయిన వీఆర్ఏల కుటుంబాలకు న్యాయం చేయాలని TGTA ఆర్గనైజింగ్ సెక్రెటరీ విక్రమ్ కుమార్ కోరారు. వీఆర్ఏ ఉద్యోగం చేస్తూ CCLA కార్యాలయం నుంచి జారీ చేసిన సర్కులర్ కంటే ముందు చనిపోయిన వీఆర్ఏలందరికి కూడా వారి వారసులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కారణంగా నియమాకాలు చేపట్టి వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఇట్టి విషయంలో లచ్చి రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.
- వరంగల్, హనుమకొండ మండలాల నూతన TGRSA కమిటీ ఏర్పాటు
జిల్లా అధ్యక్షుడిగా ముత్తినేని రంజిత్ కుమార్, జనరల్ సెక్రటరీగా ప్రసాద్ జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి హనుమకొండ జిల్లా TGRSA సెక్రటరీగా రంజిత్ కుమార్, జనరల్ సెక్రటరీగా జి నాగేంద్రప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్షుడుగా నాగేంద్రప్రసాద్, జనరల్ సెక్రటరీగా కీర్తన్ ఎంపికయ్యారు. ఇదే కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గా సుభాన్, సుమన్, జలపతి ఎన్నికయ్యారు.