వరంగల్ డీటీవోపై వేటు.. రవాణాశాఖలో కలకలం
- నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్.. అరెస్ట్
- ఇవాళ రవాణాశాఖ జిల్లా అధికారి లక్ష్మి బదిలీ
- ఉత్తర్వులు జారీచేసిన ఉన్నతాధికారులు
- ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు
- అవినీతికి అడ్డాగా వరంగల్ రవాణాశాఖ కార్యాలయం !
- దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం..
అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ రవాణాశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రవాణా శాఖ కార్యాలయ పక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిన్న డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కోట్లల్లో అక్రమస్తులు కూడపెట్టినట్లు గుర్తించి ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే ఇవాళ వరంగల్ డీటీవోగా పని చేస్తున్న లక్ష్మీపై వేటు పడింది. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఆమెను రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు అవినీతి ఆరోపణల నేపథ్యంలో డీటీవోపై వేటు వేసినట్లు తెలుస్తోంది. గతంలో డీటీవో లక్ష్మికి వరంగల్ కలెక్టర్ నుంచి షోకాస్ నోటీసులు సైతం అందాయి. తాజాగా ఆమెను డీటీవోగా తప్పిస్తూ ఉత్తర్వులు జారీకావడం కలకలం రేపుతోంది. వరంగల్ ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.