మకాం మార్చిన ఇసుక మాఫియా

మకాం మార్చిన ఇసుక మాఫియా

  • అక్రమ సంపాదనకై మహదేవపూర్ కు షిఫ్ట్
  • ఓం ఇసుక ట్రాక్టర్ పట్టివేత 
  • మూడు రోజుల నుంచి జోరుగా రవాణా?

మకాం మార్చిన ఇసుక మాఫియా...!!!

* అక్రమ సంపాదనకై మహదేవపూర్​ కు షిఫ్ట్
​ 
* మహదేవపూర్​ లో ఇసుక ట్రాక్టర్​ పట్టివేత
 
* మూడు రోజులుగా కుదురుపల్లి నుండి జోరుగా అక్రమ ఇసుక రవాణా...?

 * కేసు నుండీ తప్పించాలంటూ అధికారులతో మంతనాలు 

అక్షర దర్బార్​, కాటారంః
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని విలాసాగర్​ నుండి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ అక్రమార్జనకు తెగపడ్డారు. ఈ విషయమై 'అక్షర దర్బార్'​ పత్రికలో వరుస కథనాలు వెలువడగా స్పందించిన పోలీస్​ యంత్రాంగం విలాసాగర్​ నుండీ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేశారు. కొందరు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపులుగా ఏర్పాటుచేసుకుని వరంగల్​,హైదరాబాద్​ లాంటి నగరాలకు లారీల్లో తరలిస్తూ సొమ్ముచేసుకున్నారు.ఈ నేపథ్యంలో స్పందించిన కాటారం పోలీసులు అక్రమ ఇసుక రవాణా ఉక్కుపాదం మోపి కేసులు నమోదు చేయగా సదరు ఇసుక స్మగ్లర్లు మకాం మార్చారు.మహదేవపూర్​ మండలం కేంద్రంగా అర్థరాత్రుల్లో ఇసుక తరలింపుకై పన్నాగం పన్ని అక్రమార్గంలో ఇసుకను తరలిస్తుండగా ఆదివారం రెండ్​ హ్యాండెడ్​ గా ఓ ట్రాక్టర్​ పట్టుబడింది.కాగా ఆ ట్రాక్టర్​ కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చెందిన వ్యక్తిదిగా తెలుస్తోంది.


సండే కలిసొస్తుందనే పక్కా ప్లాన్ 

 
 ఆదివారం అధికారులు అందుబాటులో ఉండరనే పక్కా ప్రణాళికతో కాటారం మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమ ట్రాక్టర్లను కుదురుపల్లిలోని ఇసుకను  అర్థరాత్రి నుండి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. అక్రమార్జనకై బానిసైన సదరు వ్యక్తులు కాటారం మండలంలో  ఇసుక రవాణాను బంద్​ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.దీంతో ఏమైనా సరే తగ్గేదెలే అంటూ మహదేవపూర్​ మండలమే తమ అక్రమార్జనకు అనువైన ప్రాంతమని భావించి సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో  ఆదివారం అనువైన సమయమైన మేం ఆఫ్​ డ్యూటి అని చెప్పుకోవచ్చనీ మీ పని మీరు చేసుకోండి మాకేమైనా ఉంటే చూసుకోండంటూ సదరు అక్రమ ఇసుక రవాణా వ్యక్తులకు ముందస్తూ సంకేతాలు కింది స్థాయి ఉద్యోగుల తో సంబంధిత అధికారులు చెప్పించినట్లు తెలుస్తోంది.అయితే విషయం కాస్తా స్థానిక మీడియాకు తెలియడంతో స్వయంగా ఆ రిపోర్టర్లు అధికారులకు సమాచారం అందించగా ఏం చేయలేని స్థితిలో ట్రాక్టర్​ ను పట్టుకున్నట్లుగా తెలుస్తున్నది.కాగా పట్టుబడిన ట్రాక్టర్​ యజమాని తన బంధువులైన రాజకీయ నాయకుల అండదండలతో కేసు నుండీ తప్పించుకునేందుకు మంతనాలు జరిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Tags:

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..    ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి    అక్షర దర్బార్, శాయంపేట       ఆయిల్ పంట ఫామ్ దగ్ధం
Read More...
ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల పంజా..

ఐఈడీ బాంబుతో భద్రతా బలగాల‌ వాహనం పేల్చివేత  8 మంది జ‌వాన్లు, డ్రైవ‌ర్ మృతి మ‌రికొంద‌రికి తీవ్ర గాయాలు ధృవీక‌రించిన బ‌స్త‌ర్ ఐజీ  అక్ష‌ర‌ద‌ర్బార్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ :...
Read More...
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల పంజా..

సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

   పీడీఎస్ రైస్ వ్యాపారిని రూ.4 లక్షల డిమాండ్  రూ.2 లక్షలు  తీసుకున్నారనే ఆరోపణలు  విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కలకలం 
క్రైమ్ 
Read More...
సీఐని అరెస్టు చేసిన ఏసీబీ

మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

రెండు రాష్ట్రాల సరిహద్దులో కలకలం మావోలు అమర్చిన ప్రెజర్ బాంబు పేలి ఒకరికి గాయాలు ముత్యందార జలపాతం అటవీ ప్రాంతంలో ఘటన
క్రైమ్ 
Read More...
మరోసారి పేలిన ప్రెజర్ బాంబు

పేకాట రాయళ్ళు అరెస్టు

*పేకాట రాయళ్ళు అరెస్టు*    -ఇద్దరు వ్యక్తులు అరెస్టు, ఇద్దరు పరారు    అక్షర దర్బార్, శాయంపేట  గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్...
Read More...
పేకాట రాయళ్ళు అరెస్టు