ఆరూరి, కడియం నమ్మకద్రోహులు.
- బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సస్పెన్షన్
- మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
అవినీతి బయట పడుతుందన్న భయంతో బీజేపీలో చేరిన ఆరూరి.
అరూరి, కడియం నమ్మక ద్రోహులు..
బీఆర్ఎస్ పార్టీ నుండి పట్టణ అధ్యక్షుడిని సస్పెండ్ చేసిన చల్లా...
అక్షర దర్బార్, పరకాల.
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి నమ్మకద్రోహం చేశారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పరకాల పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరూరి రమేష్ కు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ టికెట్ వస్తుందని తెలిసినా కావాలనే పార్టీ నుండి తన అవినీతి బయటపడుతుందనే భయంతో ఆయన బిజెపి పార్టీలో చేరారని ఆరోపించారు. అదేవిధంగా ఎమ్మెల్యే డియం శ్రీహరి కూతురు కావ్యకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చాక కడియం శ్రీహరి నమ్మకద్రోహం చేసి తన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారని, వీరిని ప్రజలు ఆదరించారని, ఇలాంటి నమ్మకద్రోహులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
పరకాల పట్టణ అధ్యక్షుడిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా..
పరకాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మడికొండ శ్రీనును పార్టీ నుండి, అధ్యక్ష పదవి నుండి సస్పెండ్ చేసినట్లు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు. పార్టీలో పని చేయని వారు ఎవరున్నా పార్టీని వదిలి వెళ్లాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.