నన్ను జైలుకు పంపడానికి కుట్ర

నన్ను జైలుకు పంపడానికి కుట్ర

  • మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  • నాలుగుసార్లు ఓడిపోయిన కడియం నాపై విమర్శలు చేస్తుండని ధ్వజం
  • కావ్య చిత్తుచిత్తుగా ఓడిపోనుందని వ్యాఖ్యలు
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించేందుకు  యత్నిస్తున్నారని ఆరోపణ

అక్షర దర్బార్, పాలకుర్తి:
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ శనివారం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో జరిగిన రైతు దీక్షలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ దీక్షలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పై కుట్రలు చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పోతే పోతా.. కానీ పార్టీ మారనని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. గతంలో రైతుల కోసం మూడు సార్లు పోలీసులతో దెబ్బలు పడ్డ.. జైలుకు పోయిన అన్నారు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 
పదవుల కోసం పార్టీలు మరినోడు, నాలుగు సార్లు చిత్తుచిత్తుగా ఒడిన కడియం శ్రీహరి నామీద విమర్శలు చేస్తుండు. నా నలభై ఏళ్ల రాజకీయ అనుభవంతో చెపుతున్న... కడియం కావ్య ఈ పార్లమెంటు ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోనుందని దయాకర్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ గణపురం ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కొద్దిరోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తన మనవరాలు వయసు గల యశస్విని రెడ్డిపై ఓడిపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు సిగ్గులేకుండా తనపై విమర్శలు చేస్తున్నారని విరుచుకుపడిన నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ కడియంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయమయ్యాయి.

Tags:

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..    అంజన్న ఆశీస్సులు తండా ప్రజలమీద ఉండాలి.    - మాజీ సర్పంచ్ భూక్యా రమేష్    అక్షర దర్బార్, శాయంపేట     అంజన్న ఆశీస్సులు తండా...
Read More...
అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..