దేశంలో బలంగా కుల వివక్ష..
అగ్రనేత రాహుల్‌గాంధీ ..
By SL
On
- అన్ని రంగాల్లోనూ వేళ్లూనుకొని ఉంది..
* తెలంగాణలో కుల గణన దేశానికే ఆదర్శం
* నిజం బయటకు రావొద్దనే వాళ్లే అడ్డుకుంటున్నారు
* ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ..
* హైదరాబాద్‌లో మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాలతో సమావేశం - అక్షరదర్బార్, హైదరాబాద్: దేశంలో కుల వివక్ష బలంగా ఉందని, రాజకీయ, న్యాయ వ్యవస్థలోనూ పాతుకుపోయిందని ఏఐసీసీ (aicc) అగ్రనేత రాహుల్‌గాంధీ (rahul gandhi) అన్నారు. అగ్రకులాలకు ఎప్పుడూ కుల వివక్ష కనపడదని, దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే కుల వివక్ష రూపుమాపాలని రాహుల్ అన్నారు. తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభంకానున్న కుల గణన దేశానికే ఆదర్శమని అన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. కుల గణన ద్వారా ఎవరికీ నష్టం కలగకుండా చూడొచ్చని, అందరికీ సమన్యాయం జరుగుతుందని అన్నారు. నిజం బయటకు రావొద్దనే వాళ్లే కుల గణనను అడ్డుకుంటున్నారని రాహుల్ విమర్శించారు.
- కుల గణనపై అభిప్రాయ సేకరణ
- ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ (hyderabad) చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణనకు సంబంధించి మేధావులు, పౌరహక్కుల, ప్రజాసంఘాల నాయకులు, కుల సంఘాలతో బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్న రాహుల్.. అంత బిజీ షెడ్యూల్‌లోనూ కులగణన కార్యక్రమానికి సమయం కేటాయించారు. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బోయిన్‌పల్లిలోని గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు వెళ్లారు. టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సదస్సులో పాల్గొని నేతలతో చర్చించారు. కులగణనపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు.
About The Author
తాజా వార్తలు
ఎస్బీఐలో భారీ చోరీ
19 Nov 2024 13:18:14
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం దాదాపు 10 కిలోల బంగారం అపహరణ విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...