నిన్న కాంగ్రెస్.. నేడు బీఆర్ఎస్
- కండువాలు మార్చుకుంటున్న జంప్ జిలానీలు
- ముక్కున వేలేసుకుంటున్న జనం
నిన్న కాంగ్రెస్... నేడు బీఆర్ఎస్
అక్షర దర్బార్, పరకాల:
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాల్లో జంపు జిలానీలు ఎక్కువవుతున్నారు. తాము ఉన్న పార్టీని వీడి మరో పార్టీలో చేరడం, తర్వాత కొందరు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పి తిరిగి గతంలో తాము పని చేసిన పార్టీ గూటికి చేరటం జరుగుతుంది. పరకాల పట్టణంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10వ వార్డు యూత్ నాయకుడు తెల్లారే తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాడు. బీఆర్ఎస్ నాయకులు గంలాబీ కండువా కప్పి స్వాగతించారు. ఒకరికి మించి ఒకరు ప్రలోభాలకు గురి చేస్తూ యువకులను పార్టీలు మారే విధంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కొందరు కృషి చేస్తున్నారని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పార్టీ మారటం కండువాలను మార్చుకోవడానికి రాజకీయ నేతలు కొందరు ఆరాటపడుతుండటం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.