మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య..
By DS
On
- వేట కొడవలితో గొంతుకోసిన దుండగుడు
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఘటన
అక్షరదర్బార్, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. రాయపోలు - ఎండ్లగూడ రహదారిపై సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కానిస్టేబుల్ నాగమణి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం కాగా.. పదినెలల క్రితం భర్త విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో నెల క్రితం మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నారు. ఇది తట్టుకోలేని ఆమె సోదరుడు కానిస్టేబుల్‌ను దారుణంగా హత్యచేశాడు. విధులకు వెళ్తుండగా.. కారుతో ఢీకొట్టి వేట కొడవలితో గొంతుకోశాడు. మృతురాలి స్వస్థలం రాయపోలుగా పోలీసులు గుర్తించారు.
Tags:
About The Author
తాజా వార్తలు
భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు
04 Dec 2024 08:39:46
ప్రకంపణల తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.3గా నమోదు ఉదయం 7:27 గంటలకు కొన్ని సెంకండ్లపాటు కంపించిన భూమి ఇండ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు అక్షరదర్బార్,...