వైట్ కాలర్స్‌లో విభిన్న స్పందన....

వైట్ కాలర్స్‌లో విభిన్న స్పందన....

వైట్ కాలర్స్‌లో విభిన్న స్పందన....
- గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకుంటున్న నేతలు...
- నేనంటే నేనంటున్న వైనం...
- చిత్తశుద్ధి లేకుండా చేసే కార్యంలో ఈ వింత పోకడ ఎందుకో...
 
అక్షర దర్బార్/కేసముద్రం.... 
సామాన్యుల పంచాయతీలను వ్యాపారంగా మలుచుకున్న పలువురు పెద్దమనుషుల తీరుపై అక్షరం దర్భార్ పత్రిక ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దీనిపై భిన్నమైన స్పందన రాగా.. పలువురి తీరుమాత్రం తీవ్ర విమర్శలపాలయ్యే దుస్థితి తెచ్చుకున్నారు.గుమ్మడికాయల దొంగలు ఎవరంటే.. భుజాలు తడుముకున్న మాదిరిగా.. వ్యవహరిస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలోని పలు గ్రామాల వైట్ కాలర్స్ పెద్దమనుషులు తీరును ప్రశ్నిస్తూ.. ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది అక్షరం దర్జార్. దీనిపై ప్రజల్లో హర్షాతిరేకలు రాగా.. అదే పనిగా పెట్టుకున్న పలువురి వైట్ కాలర్స్‌కి మాత్రం జీర్ణుంచుకోలేని అంశంగా మారింది.పలువురైతే.. కథనంపై,కథనం ప్రచురించిన వారిపై కేసులు పెడతామని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి.వాస్తవంగా ఎవరు ఇలా ఉన్నారు.. ఎవరు పంచాయతీలు చేయడమే వృత్తిగా ఎంచుకున్నారు.. ఎవరు పేదల,సామాన్యుల డబ్బులు డిపాజిట్ల రూపంలో లాగేస్తున్నారు అనేది ఆలోచన చేయకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇలా ఒంటెద్దు పోకడలకు యత్నిస్తున్న పరిస్థితి.కేసముద్రం మండలంలో ఈ వ్యవహరం పరిపాటిగా మారినప్పటకీ... మారాల్సిన వారిలో మార్పు రాకపోవడమే ఇక్కడ సమస్యగా మారింది. అధికారుల చట్టూ,చట్టాల చుట్టూ తిరగలేక.. చుట్టంలాగా,మనలో ఒకడిగా ఉన్నోడి దగ్గరే మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని పెద్దరికం అప్పజెప్తే.. అందినకాడికి లాగేసే మాదిరిగా పెద్దమనుషులు తయారైన దుస్థితినే ప్రశ్నించాలన్నది అక్షరం దర్బార్ ఉద్దేశం. వైట్ కాలర్ చొక్కాలు ఉండగానే కాదు.. నేతల వ్యవహర శైలి కూడా అదే విధంగా ఉండాలి. పేదలకు న్యాయం చేయాలి. డిపాజిట్ లేకుండా పంచాయతీలు చేయాలి. సామరస్యంగా పోయే వాటిని తీవ్ర రూపం దాల్చకుండా మద్యలోనే అడ్డుకట్ట వేసి పరిష్కరించాలి, అన్నదమ్ముల వివాదాలను కలిసి ఉండే విధంగా పరిష్కారం చూపాలి.భార్యభర్తల వివాదాలైతే.. చెప్పినా విననప్పుడు.. చట్టపరంగా వెళ్లాలని సలహాలు ఇవ్వాలి. అంతే కానీ.. దీన్ని దృష్టిలో లేకుండా ఇష్ఠానుసారంగా వ్యవహరిస్తాం, సామాన్యులను పట్టి పీడిస్తాం, అంతా నేను చెప్పిందే నడవాలి అనే ఒంటెద్దుపోకడ నాయకులను నడిబజార్లో నిలబెట్టి నిగ్గతీసి నిలదీసేందుకు అక్షరం దర్బార్ సిద్ధంగా ఉంది.ఇటీవల తరచు ఓ మేజర్ గ్రామపంచాయతీలలో జరిగిన ఘటనలే దీనికి నిదర్శనం అవుతాయి అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన ఓ పెద్దమనిషి శిష్యుని లీలలే దీనికి నిదర్శనం. ఇప్పటికైనా ఆ పెద్దమనిషి శిష్యుడు ఇలాంటి కృత్యాలు ఆపుతాడా లేదా అనేది వేచి చూడాల్సిందే మరి....IMG-20241104-WA0491
Tags:

About The Author

AV Picture

తాజా వార్తలు

ఎస్బీఐలో భారీ చోరీ ఎస్బీఐలో భారీ చోరీ
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం  దాదాపు 10 కిలోల బంగారం అపహరణ  విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...
దేశంలో బ‌లంగా కుల వివ‌క్ష‌..
టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌
డోంట్​ కేర్​.​.!
ధడేల్.. ధడేల్
వైట్ కాలర్స్‌లో విభిన్న స్పందన....
ఆగని ఇసుక జీరో దందా!
కాంగ్రెస్ లో ఫ్లెక్సీ వార్!
హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాలలు...
గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...
క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..
ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 
పసికందు అపహరణ!
వరంగల్ బిడ్డ మ‌రో ప్ర‌పంచ రికార్డు
ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు అగ్ర‌నేత జగన్ హ‌తం
హైడ్రా పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకే
వాగులో గ‌ల్లంతైన మోతీలాల్ మృత‌దేహం ల‌భ్యం..
వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌..
బిగ్ బ్రేకింగ్‌.. ఆకేరువాగులో సైంటిస్ట్ మృత‌దేహం ల‌భ్యం
జోరు వానలో ఎమ్మెల్యే పర్యటన
కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు గల్లంతు
భర్తను కట్టేసి.. భార్య గొంతు కోసి
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
సుధాకర్ రావు ప్రధమ వర్ధంతి...
పరకాలలో గంజాయి పట్టివేత..
ఏసీబీ వలలో ఎస్సై, పీసీ
ఔదార్యం చాటుకున్న కోగిల బ్రదర్స్.
షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో వస్తువులు దగ్ధం.
ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
పనిచేసిన షాపులోనే చోరీ - ఘరానా దొంగ అరెస్ట్ - రూ.52 లక్షల బంగారం రికవరీ - గోల్డ్ అమ్మే ప్రయత్నంలో పట్టుబడిన దొంగ
కమిషనరేట్ లో డ్రగ్స్ కంట్రోల్ టీమ్
చర్లపల్లిలో పిడిఎస్ బియ్యం పట్టివేత.....
బిల్డింగ్ పైనుంచి కిందపడిన గురుకుల విద్యార్థిని...
స్టడీ ఎంబీఏ... చేసేది సైబర్ నేరాలు
విజిలెన్స్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై లైంగిక దాడి
నాన్ లేఅవుట్..‌ ఫుల్ బెనిఫిట్
దుబాయ్ వెళ్లేందుకు చోరీలు!
కేసు దర్యాప్తులో అవకతవకలు
కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్ లు
ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్

ఈ-పేపర్‌