ఏసీబీ వలలో ఎస్సై, పీసీ
- స్టేషన్ బెయిల్ కోసం రూ.70 వేలు డిమాండ్
- రూ.40 వేలు తీసుకుంటూ దొరికిన వైనం
- ఎస్సై, కానిస్టేబుల్ అరెస్టు
- వరంగల్ జిల్లాలో ఘటన
ఏసీబీ వలలో ఎస్సై, కానిస్టేబుల్
- రూ.40 వేలు తీసుకుంటూ అడ్డంగా బుక్
అక్షర దర్బార్, పర్వతగిరి:
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దూకుడు మరింత పెంచారు. లంచం పుచ్చుకుంటున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై వల విసురుతున్నారు. ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్న అవినీతిపరులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. తాజాగా వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న గుగులోతు వెంకన్న, కానిస్టేబుల్ సదానందం శుక్రవారం ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. స్టేషన్ బెయిల్ ఇప్పించే విషయమై ఓ బెల్లం వ్యాపారి నుంచి రూ.40 వేలు తీసుకుంటూ ఎస్సై వెంకన్న, కానిస్టేబుల్ సదానందం అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. బెల్లంతో పట్టుబడిన వ్యాపారిని స్టేషన్ బెయిల్ కోసం కానిస్టేబుల్ సదానందం ద్వారా ఎస్ఐ వెంకన్న రూ.70 వేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రూ.20 వేలు బెల్లం వ్యాపారి ఫోన్ పే ద్వారా పంపారు. శుక్రవారం రూ.40 వేల నగదు బెల్లం వ్యాపారి ఇస్తుండగా స్వీకరిస్తున్న ఏసీబీ అధికారులు ఎస్సై వెంకన్న, కానిస్టేబుల్ సదానందంను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య ఆద్వర్యంలో ఈ దాడి జరిగింది. లంచం స్వీకరిస్తూ ఒక ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీ అధికారుల చేతికి చిక్కడం సంచలనం కలిగించింది