విజిలెన్స్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
- జీహెచ్ఎంసీ పరిధిలో వాటర్ లాగింగ్ పాయింట్లపై నజర్
- క్యాచ్ ఫిట్స్, మ్యాన్ హోల్స్ క్షేత్రస్థాయిలో పరిశీలన
- చెత్తను రెండు రోజుల్లో తొలగించాలని ఆదేశాలు
మ్యాన్ హాల్స్ లో నిలిచిన చెత్తను యుద్దప్రాతిపదికపై తొలగించాలి
- జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఏవీ రంగనాథ్
అక్షర దర్బార్, హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలో మ్యాన్ హోల్స్ లో నిలిచిపోయిన చెత్తను రెండు రోజుల్లో పూర్తిగా తొలగించాలని జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను అదేశించారు. జీహెచ్ ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ కమిషనర్ గా నియమితులైన ఏవీ రంగనాథ్ తొలిసారి శుక్రవారం హైదరాబాద్ మహా నగరంలో క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వర్షాలు భారీ స్థాయిలో పడుతుండటంతో వర్షం నీరు రోడ్లపై నిలిచి పోకుండా ఉండేందుకు విజిలెన్స్ కమిషనర్ ముందుగా మహా నగరంలో 140కి పైగా ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మాదాపూర్ లోని వాటర్ లాగింగ్ పాయింట్లను అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద వుండే క్యాచ్ ఫిట్స్ / మ్యాన్ హోల్స్ ను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్బంగా వర్షం నీరు ప్రవాహం వేగాన్ని తగ్గించే విధంగా క్యాచ్ ఫిట్స్ / మ్యాన్ హోల్స్ లో నిలిచిన చెత్తను గుర్తించిన కమిషనర్ రెండురోజుల్లో నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన క్యాచ్ ఫిట్స్ / మ్యాన్ హోల్స్ లో వర్షం నీరు ప్రవాహానికి అడ్డుగా వున్న చెత్తతో పాటు పేరుక పోయిన ఇసుకను యుద్ధప్రాతిపదికన తొలగించాలని సంబందిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను విలిజిలెన్స్ కమిషనర్ రంగనాథ్ అదేశించారు.