కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు గల్లంతు

కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు గల్లంతు

  • మరిపెడ మండలంలో ఆకేరు వాగు వద్ద ఘటన
  • కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తండ్రి కూతురు 
  • కూతురు సైంటిస్ట్... జాడ లేని ఇద్దరి ఆచూకీ 
  • నెక్కొండ మండలంలో కాజువేల మధ్య చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
  • బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు 
  • ఇంటి కన్నా వద్ద కొట్టుకపోయిన రైల్వే ట్రాక్ 
  • నిలిచిన రైళ్ల రాకపోకలు.. స్తంభించిన జనజీవనం

అక్షర దర్బార్, వరంగల్ : భారీ వర్షాలతో వరద బీభత్సం సృష్టిస్తుంది. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి విధ్వంసం జరుగుతుంది. వరద నీటి ప్రవాహంతో వాగులు, కాలువలపై గల వంతెనలు, లో లెవెల్ కాజ్ వేల మీదుగా వరద నీరు ప్రవహిస్తుంది. కేసముద్రం మండలంలోని ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక రూట్లలో రాకపోకలు స్తంభించాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమయగూడెం శివారులోని ఆకేర్ వాగులో వరద నీటి ప్రవాహానికి ఓ కారు కొట్టుకపోయింది. ఆ కారులో ప్రయాణిస్తున్న తండ్రి కూతురు ఇద్దరూ గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా గేటు కారేపల్లి గంగారముకు చెందిన మోతిలాల్ ఆయన కూతురు అశ్విని కారులో హైదరాబాద్ బయలుదేరారు. అశ్విని సైంటిస్ట్. ఆమెతో కలిసి తండ్రి మోతిలాల్ కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ప్రయాణీకులతో కూడిన ఓ ఆర్టీసీ బస్సు వరద నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది.

- రెండు కాజ్ వేల మధ్య చిక్కుకపోయిన ఆర్టీసీ బస్సు


నెక్కొండ- మహబూబాబాద్ రహదారిలో వెంకటాపురం గ్రామం వద్ద రెండు లో లెవెల్ కాజ్ వేల మధ్య ఆర్టీసీ బస్సు చిక్కుకపోయింది. వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాత్రి వెంకటాపురం వద్ద గ్రామం వద్ద చెరువు కింద ఉన్న పంట పొలాలకు నీరు వెళ్లే లో లెవెల్ కాజ్ వే దాటి ముందుకు వెళ్ళింది. సమీపంలో ఎదురుగా ఇదే చెరువు అలుగు నీరు ప్రవహిస్తున్న లో లెవెల్ కాజ్ వే దాటనీయకపోవడం వల్ల బస్సు మధ్యలోనే ఆగిపోయింది. వెనక్కి తిరిగి వద్దామంటే అప్పటికే పంట పొలాలకు నీరు వెళ్లే కాలువపై గల లో లెవెల్ కాజ్ వే మీదుగా ప్రవాహం పెరిగింది. దీంతో ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక రెండు కాజ్ వేల మధ్యలో రహదారిపైనే బస్సు నిలిచిపోయింది. ఈ రెండు కాజ్ వేల మధ్య రోడ్డు దాదాపు 200 మీటర్ల గ్యాప్ ఉంది. ఈ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అందరూ సురక్షితం. తాము చిక్కుకుపోయిన విషయాన్ని అధికారులకు సమాచారం ఇచ్చారు. వీరిని బయటకు తీసుకొచ్చేందుకు నెక్కొండ పోలీసులు ఉదయం వెంకటాపురం గ్రామం వద్దకు చేరుకున్నారు. బస్సులోని ప్రయాణికులను పంట పొలాలకు నీరు వెళ్లే కాజ్ వే మీదుగా బయటకు తీసుకొచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు.

IMG-20240901-WA0006

IMG-20240901-WA0023

Tags:

About The Author

RV Picture

తాజా వార్తలు

ఎస్బీఐలో భారీ చోరీ ఎస్బీఐలో భారీ చోరీ
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం  దాదాపు 10 కిలోల బంగారం అపహరణ  విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...
దేశంలో బ‌లంగా కుల వివ‌క్ష‌..
టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌
డోంట్​ కేర్​.​.!
ధడేల్.. ధడేల్
వైట్ కాలర్స్‌లో విభిన్న స్పందన....
ఆగని ఇసుక జీరో దందా!
కాంగ్రెస్ లో ఫ్లెక్సీ వార్!
హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాలలు...
గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...
క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..
ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 
పసికందు అపహరణ!
వరంగల్ బిడ్డ మ‌రో ప్ర‌పంచ రికార్డు
ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు అగ్ర‌నేత జగన్ హ‌తం
హైడ్రా పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకే
వాగులో గ‌ల్లంతైన మోతీలాల్ మృత‌దేహం ల‌భ్యం..
వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌..
బిగ్ బ్రేకింగ్‌.. ఆకేరువాగులో సైంటిస్ట్ మృత‌దేహం ల‌భ్యం
జోరు వానలో ఎమ్మెల్యే పర్యటన
కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు గల్లంతు
భర్తను కట్టేసి.. భార్య గొంతు కోసి
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
సుధాకర్ రావు ప్రధమ వర్ధంతి...
పరకాలలో గంజాయి పట్టివేత..
ఏసీబీ వలలో ఎస్సై, పీసీ
ఔదార్యం చాటుకున్న కోగిల బ్రదర్స్.
షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో వస్తువులు దగ్ధం.
ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
పనిచేసిన షాపులోనే చోరీ - ఘరానా దొంగ అరెస్ట్ - రూ.52 లక్షల బంగారం రికవరీ - గోల్డ్ అమ్మే ప్రయత్నంలో పట్టుబడిన దొంగ
కమిషనరేట్ లో డ్రగ్స్ కంట్రోల్ టీమ్
చర్లపల్లిలో పిడిఎస్ బియ్యం పట్టివేత.....
బిల్డింగ్ పైనుంచి కిందపడిన గురుకుల విద్యార్థిని...
స్టడీ ఎంబీఏ... చేసేది సైబర్ నేరాలు
విజిలెన్స్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై లైంగిక దాడి
నాన్ లేఅవుట్..‌ ఫుల్ బెనిఫిట్
దుబాయ్ వెళ్లేందుకు చోరీలు!
కేసు దర్యాప్తులో అవకతవకలు
కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్ లు
ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్

ఈ-పేపర్‌