మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై లైంగిక దాడి
- సర్వీస్ రివాల్వర్ తో బెదిరించిన ఎస్సై
- ఎవరికైనా చెబితే ఇదే చివరి రోజు అని బెదిరింపు
- విచారణ చేపట్టిన పోలీస్ ఉన్నతాధికారులు
- కాలేశ్వరం ఎస్సై భవాని సేన్ పై కేసు మోదు
- ఎస్సైని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అక్షర దర్బార్, భూపాలపల్లి: పోలీసు శాఖలో ఓ సబ్ ఇన్ స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం ఇది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రెండు రాష్ట్రాల సరిహద్దున గల ఓ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ కొద్ది రోజుల క్రితం తన నివాసానికి సమీపంలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్ కు ఫోన్ చేశాడు. ప్రమాదవశాత్తు ఇంట్లో కాలుజారి కాలు జారి పడిపోయానని, ఫ్రాక్చర్ అయినందున లేవలేక పోతున్నాని, వచ్చి సాయం చేయాలని అన్నట్లు తెలిసింది. దీంతో సదరు మహిళా కానిస్టేబుల్ సబ్ ఇన్ స్పెక్టర్ ఇంటికి చేరుకోగా అప్పటికే పక్కా ప్లాన్ తో ఉన్న సబ్ ఇన్ స్పెక్టర్ మహిళా కానిస్టేబుల్ తన ఇంట్లోకి రాగానే తలుపులు పెట్టి కామ వాంఛ తీర్చాలని, లేకుంటే చంపేస్తా అంటూ తన సర్వీస్ రివాల్వర్ తో బెదిరించాడు. ఎవరికైనా చెప్తే నీకు ఇదే చివరి రోజు అని బెదిరించి తన కోరిక తీర్చుకున్నట్లు సమాచారం. తర్వాత మరో రోజు ఆ సబ్ ఇన్ స్పెక్టర్ మహిళా కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. తన పై అధికారి కావడం, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడం వల్ల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మహిళా కానిస్టేబుల్ భయపడినట్లు తెలిసింది. చివరకు సమాచారం అందడంతో పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి ఆ సబ్ ఇన్ స్పెక్టర్ పనిచేస్తున్న పోలీసు స్టేషన్ సందర్శించి మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడి విషయమై విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇది భూపాలపల్లి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సబ్ ఇన్ స్పెక్టర్ గతంలో పనిచేసిన చోట కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చినట్లు తెలిసింది.
పోలీసుల అదుపులో ఎస్సై ....
బాదిత మహిళా కానిస్టేబుల్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేను కలిసి గోడు వెళ్ళబోసుకున్నట్లు తెలిసింది. దీంతో బుధవారం కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై భవాని సేన్ ను అదుపులోకి తీసుకున్నారు.