బిగ్ బ్రేకింగ్.. ఆకేరువాగులో సైంటిస్ట్ మృతదేహం లభ్యం
By DS
On
- గల్లంతైన తండ్రీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు
అక్షరదర్బార్, మహబూబాబూబాద్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది.. ఆదివారం ఉదయం కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రీ, కూతురు నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. బ్రిడ్జి వద్ద అదుపుతప్పి కారు నీటిలోకి కొట్టుకుపోయింది. అయితే.. తమ కారు వాగులోకి కొట్టుకుపోయిందని, తమను రక్షించాలంటూ వారు బంధువులకు ఫోన్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా మధ్యాహ్నం నూనావత్ అశ్విని అశ్విని మృతదేహం లభ్యమైంది. బ్రిడ్జికి కొద్ది దూరంలో జామాయిల్ చెట్ల మధ్య మృతదేహం చిక్కుకుంది. ఇక తండ్రి నూనావత్ మోతిలాల్ ఆచూకీ కోసం పోలీసులు, రెస్య్యూ టీం సిబ్బంది గాలింపు చేపడుతున్నారు. వాగులో తండ్రీ కూతురు గల్లంతవడం, కూతురు విగతజీవిగా లభ్యమవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
About The Author
తాజా వార్తలు
ఎస్బీఐలో భారీ చోరీ
19 Nov 2024 13:18:14
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం దాదాపు 10 కిలోల బంగారం అపహరణ విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...