ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి సుధీర్ కుమార్ ను గెలిపించాలి. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా..
ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి సుధీర్ కుమార్ ను గెలిపించాలి.
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా..
అక్షర దర్బార్, పరకాల.
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపును కాంక్షిస్తూ పరకాల మండలం అలియాబాద్, పోచారం, వేల్లంపల్లి, కామారెడ్డిపల్లి గ్రామలలో బిఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మే13న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి డా. సుధీర్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందుకు ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి గెలుపు దిశగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల జడ్పిటిసి సిలువేరు మొగిలి, పరకాల మండలం టిఆర్ఎస్ అధ్యక్షుడు చింతి రెడ్డి మధుసూదన్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు శాతరాశి సనత్ కుమార్ పటేల్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.