కారు గుర్తుకు ఓటేద్దాం.. తెలంగాణను కాపాడుకుందాం..
కారు గుర్తుకు ఓటేద్దాం.. తెలంగాణను కాపాడుకుందాం..
చల్లా ధర్మారెడ్డి.
అక్షర దర్బార్, పరకాల.
కాంగ్రెస్ చేతిలో తెలంగాణ ఆగం కాకూడదంటే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో వాకర్స్, కూరగాయల మార్కెట్, లేబర్ అడ్డా, బస్ స్టాండ్ కూడలి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరకాల పట్టణంలో కూరగాయల మార్కెట్ నిర్మిస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్కెట్ కు కరెంటు సప్లై ఇవ్వడం లేదన్నారు. కరెంటు సప్లై లేక ఫ్యాన్లు నడవక వ్యాపారస్తులు,ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాలు కూడా తెరిచే పరిస్థితి లేదని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మోసాలను నమ్మొద్దని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.