డోంట్​ కేర్​.​.!

దర్జాగా ఓవర్​ లోడ్​తో వెళ్తున్న బొగ్గు లారీలు

డోంట్​ కేర్​.​.!

* తగ్గేదేలే అంటున్న ఏఎమ్మార్​, ట్రాన్స్​ పోర్ట్​ అసోసియేషన్

* ఓవర్​ లోడ్​ తో రూ.లక్షల్లో సంపాదన ఇక్కడందరికీ షరా మామూళ్లే ​ 

* ప్రశ్నించే వ్యవస్థనే ఏలుతున్న ఏఎమ్మార్​, ట్రాన్స్​ పోర్టు అసోసియేషన్​ 

* ఇబ్బందులు పడుతున్న సామాన్య జనం 

అక్షర దర్బార్​, కాటారం

తాడిచర్ల ఓపెన్​ కాస్ట్​ నుండి ఏండ్ల తరబడిగా బొగ్గు లారీలు ఓవర్​ లోడ్​తో వెళ్తున్నా అధికారుల కండ్లకు కనబడట్లేదు. ఓవర్​ లోడ్​, ఓవర్​ స్పీడ్​ తో బొగ్గు లారీలు భీభత్సం సృష్టిస్తున్నప్పటికీ ఏఎమ్మార్​ కంపెనీ,ట్రాన్స్​ పోర్టు కాంట్రాక్టర్ల పలుకుబడి ముందు అదంతా దిగ దుడుపే అవుతుంది. దీంతో జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్హర్​ మండలం తాడిచర్ల గ్రామం నుండి భూపాలపల్లి వరకు గల ప్రధాన రహదారి వెంట ప్రయాణిస్తున్న ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు బాధపడితే మాకేంటి అనుకుంటున్నారో ఏమో గాని ప్రశ్నాంచాల్సిన వ్యవస్థ ఏఎమ్మార్​ కంపెనీ, ట్రాన్స్​ పోర్టు కాంట్రాక్టర్ల  ముందు మోకరిల్లుతూ జీహుజూర్​ అంటోంది. దీంతో ఏఎమ్మార్​, ట్రాన్స్​ పోర్టు కంట్రాక్టర్లు అడ్డగోలు అఘాయిత్యాలకు పాల్పడుతుండగా ప్రశ్నించే వ్యవస్థ స్వాగతం పలుతుకుండం గమనార్హం. బొగ్గు లారీల దాష్టీకానికి ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికార యంత్రాంగం మూగబోతున్న తీరు కలవరానికి గురిచేస్తుంది. ఇదేంటని ఎవరైనా అమాయకులు ప్రశ్నిస్తే వారిపై అన్యాయమైన కేసులు బనాయిస్తూ జైలుకు పంపిస్తున్నట్లు సమాచారం. గతంలో మావోయిస్టులకు కంచుకోట గా ఉన్న ఇలాఖాలోనే పారిశ్రామిక పెత్తందార్లు సృష్టిస్తున్న ఆగడాలను అరికట్టేవారే లేకపోవడంతో జనాలు మూగరోధనకు గురవుతున్నారు...

ఓవర్​ లోడ్​ తో లక్షల్లో సంపాదన

తాడిచర్ల ఓపెన్​ కాస్ట్​ నుండి బొగ్గుని తీసి జెన్కో కు తరలించడానికి ఏఎమ్మార్​ అనే సంస్థ కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఆ బొగ్గును వెలికితీసీ లారీల ద్వారా తరలించేందుకు గానూ ట్రాన్స్​ పోర్ట్​ అసోసియేషన్​ ల కాంట్రాక్టర్లతో ఏఎమ్మార్​ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో బొగ్గుకి టన్నుకు రూ.265 చొప్పున ఏఎమ్మార్​ కంపెనీ చెల్లిస్తుండగా పాసింగ్ ప్రకారం 14 టైర్ల లారీకి 32,16 టైర్ల లారీకి 35 టన్నుల బొగ్గు పోవాల్సింది ఉంటుంది. ఇలా వెళితే మనకేం లాభముంటుందని అసోసియేషన్​  కాంట్రాక్టర్లు ఏకంగా ఓవర్​ లోడ్ దందాను ఎంచుకున్నారు. ఇలా ఒక్కో లారీలో 10 టన్నులు అదనంగా వేసుకుని వెళుతుండగా​ మాజీ ఎమ్మెల్యే కు బంధువైన ఓ కాంట్రాక్టర్​ కు ఏకంగా 30 లారీలు ఉండడంతో రోజుకి రెండు ట్రిప్పులకు కలిపి రూ.1.50 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఓపెన్​ కాస్ట్​ నుండి ఓ ట్రాన్స్​ పోర్టు కాంట్రాక్టర్​ వి 30 లారీలు,మరో కాంట్రాక్టర్​ వి 20 లారీలు, ఇతరత్రా అన్నీ కలుపుకుని కాంట్రాక్టర్లకు సంబంధించి సుమారు 150 లారీలు నడస్తుండగా రోజుకు లక్షల్లో సంపాదిస్తూ జేబులు నింపుకుంటున్న తీరు ఔరా అనిపిస్తుంది.ఈ కాంట్రాక్టర్లంతా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన అసోసియేషన్​ కాంట్రాక్టర్లు కావడం వారికి ధన, రాజకీయ బలం అండదండలు మెండుగా ఉండడంతో అడ్డొచ్చే ఏ వ్యవస్థను ఈజీగా మెయింటేన్​ చేస్తూ ముందుకుసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అడ్డగోలుగా ఓవర్​ లోడ్​ వెళుతుండగా పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తు నుండి తేరుకోలేకపోతున్నారు.

ఇక్కడందరకీ షరా మామూళ్లే 
  
ఏఎమ్మార్​,ట్రాన్స్​ పోర్టు  అసోసియేషన్​ కాంట్రాక్టర్లు సంయుక్తంగా ఏర్పడి బహిరంగంగా నెలనెలా  మూమూళ్లు సమర్పించుకుంటూ తమ బిజినెస్​ ని కొనసాగిస్తున్నారు. మల్హర్​,కాటారం, భూపాలపల్లి దారి పొడవు మండలాల సంబంధిత అధికారులకు నెలచొప్పునా ముడుపులు చెల్లిస్తూ పోషిస్తున్నట్లు సమాచారం. ఎంతటి నిజాయితీ కల్గిన అధికారైనా సరే వారికి ఓ రేట్​ కడుతూ తమ దారిలోకి తెచ్చకుంటూ దందాను సాగిస్తుండడం విశేషం. అయితే ఇటీవల తాడిచర్ల ఓపెన్​ కాస్ట్​ నుండి ఓవర్​ లోడ్​తో లారీలు వెళుతున్నాయని కలెక్టర్​ రాహుల్​ శర్మ దృష్టికి చేరగా స్పందించిన కలెక్టర్​ లోడింగ్​ పాయింట్​ వద్దకు చేరుకుని ఓవర్​ లోడ్​ ను సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. వారం రోజులపాటు పాసింగ్​ తోనే లారీలు నడుపుతున్నట్లు మాయచేసిన అసోసియేషన్​ కాంట్రాక్టర్లు ఆ తర్వాత రోజునే ఓవర్​ లోడ్​ దందాను తిరిగి పునప్రారంభించడం గమనార్హం.ఇలా కలెక్టర్​ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆయన కళ్లు గప్పి నిత్యం వందలాది బొగ్గు లారీలను జెన్కో కు తరలిస్తుండగా పట్టించుకునే మిగతా జిల్లా అధికారులు మిన్నకుండిపోతున్న తీరు పై ఇక్కడ అందరికీ షరా మామూళ్లేనంటూ జనాలు చర్చించుకుంటున్నారు.

వామ్మో బొగ్గు లారీలంటూ జనం భయం 
 
తాడిచర్ల, కొయ్యూరు, గంగారం ఎక్స్ రోడ్డు, కాటారం, కొత్తపల్లి, బస్వాపూర్,భూపాలపల్లి గ్రామాల ప్రజలు బొగ్గు లారీలు వాటి నుండి పడే బొగ్గు పెళ్లలు,వచ్చే బొగ్గు డస్ట్​ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బొగ్గు డస్ట్​ వల్ల పలువురు అనారోగ్యం బారిన పడుతున్న దాఖలాలున్నాయి. అంతేకాకుండా బొగ్గు లారీల వల్ల పలువురి అమాయక ప్రాణాలు గాల్లో కలుస్తుండగా వణ్యప్రాణులు సైతం మరణిస్తున్నాయి.బొగ్గు లారీల డ్రైవర్లు హై స్పీడ్​ తో నడుపుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రేయిపగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా డ్రైవింగ్​ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటున్నారు. బొగ్గు లారీలు నడిపే డ్రైవర్లకు లైసెన్స్​ లు ఉండట్లేదని లిక్కర్​ మత్తులో తూగుతూ లారీలు నడుపుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వీరి దాష్టీకాని ఎంతో మంది విలువైన ప్రాణా ఓవర్​ లోడ్​ కారణంగా బొగ్గుపై పరదాలు సరిగ్గా కప్పకపోవడంతో లారీల నుండి బొగ్గు పెళ్లు కిందపడుతుండగా వాహనాదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. బొగ్గు లారీల నుండి పడే పెళ్లలు, వచ్చే బొగ్గు డస్ట్​ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బొగ్గు డస్ట్​ వల్ల పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు.

Tags:

About The Author

SL Picture

తాజా వార్తలు

ఎస్బీఐలో భారీ చోరీ ఎస్బీఐలో భారీ చోరీ
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం  దాదాపు 10 కిలోల బంగారం అపహరణ  విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...
దేశంలో బ‌లంగా కుల వివ‌క్ష‌..
టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌
డోంట్​ కేర్​.​.!
ధడేల్.. ధడేల్
వైట్ కాలర్స్‌లో విభిన్న స్పందన....
ఆగని ఇసుక జీరో దందా!
కాంగ్రెస్ లో ఫ్లెక్సీ వార్!
హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాలలు...
గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...
క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..
ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 
పసికందు అపహరణ!
వరంగల్ బిడ్డ మ‌రో ప్ర‌పంచ రికార్డు
ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు అగ్ర‌నేత జగన్ హ‌తం
హైడ్రా పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకే
వాగులో గ‌ల్లంతైన మోతీలాల్ మృత‌దేహం ల‌భ్యం..
వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌..
బిగ్ బ్రేకింగ్‌.. ఆకేరువాగులో సైంటిస్ట్ మృత‌దేహం ల‌భ్యం
జోరు వానలో ఎమ్మెల్యే పర్యటన
కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు గల్లంతు
భర్తను కట్టేసి.. భార్య గొంతు కోసి
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
సుధాకర్ రావు ప్రధమ వర్ధంతి...
పరకాలలో గంజాయి పట్టివేత..
ఏసీబీ వలలో ఎస్సై, పీసీ
ఔదార్యం చాటుకున్న కోగిల బ్రదర్స్.
షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో వస్తువులు దగ్ధం.
ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
పనిచేసిన షాపులోనే చోరీ - ఘరానా దొంగ అరెస్ట్ - రూ.52 లక్షల బంగారం రికవరీ - గోల్డ్ అమ్మే ప్రయత్నంలో పట్టుబడిన దొంగ
కమిషనరేట్ లో డ్రగ్స్ కంట్రోల్ టీమ్
చర్లపల్లిలో పిడిఎస్ బియ్యం పట్టివేత.....
బిల్డింగ్ పైనుంచి కిందపడిన గురుకుల విద్యార్థిని...
స్టడీ ఎంబీఏ... చేసేది సైబర్ నేరాలు
విజిలెన్స్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై లైంగిక దాడి
నాన్ లేఅవుట్..‌ ఫుల్ బెనిఫిట్
దుబాయ్ వెళ్లేందుకు చోరీలు!
కేసు దర్యాప్తులో అవకతవకలు
కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్ లు
ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్

ఈ-పేపర్‌