కమిషనరేట్ లో డ్రగ్స్ కంట్రోల్ టీమ్
- టీంలో సీఐ, ముగ్గురు ఆర్ ఎస్సైలు, సిబ్బంది
- మత్తు పదార్థాలు సేవించే ఏరియాలపై నజర్
- స్థానిక పోలీసులతో కలిసి దాడులకు ప్లాన్
- సమాచారం కోసం 8712584473 నెంబర్
- పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడి
కమిషనరేట్ లో డ్రగ్స్ కంట్రోల్ టీమ్
- వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
అక్షర దర్బార్, హనుమకొండ:
మత్తు పదార్థాల నియంత్రణకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. దేశ భవిష్యత్తు అయిన యువతతో పాటు విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడుకుండా, గంజాయి లాంటి మత్తుపదార్థాల అక్రమ రవాణాతో పాటు విక్రయాలకు పాల్పడుతున్న నేరగాళ్లపై ఉక్కుపాదాన్ని మోపి తద్వారా నేరాల నియంత్రణకు పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటుకు కమిషనర్ నిర్ణయించారు. ఒక రిజర్వ్ ఇన్స్ స్పెక్టర్, ముగ్గురు ఆర్.ఎస్.ఐలు మరికొంత మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగం పోలీసులు ట్రై సిటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా యువత మత్తు పదార్థాలను సేవించేందుకు అనువైన ప్రదేశాలతో పాటు కాలేజీలు, గంజాయి విక్రయాలు జరిగే పాఠశాలలు, ప్రధాన కూడళ్ళు, సినిమా టాకీస్ లు, షాపింగ్ మాల్స్ పై దృష్టి సారించడంతో పాటు ప్రధానంగా రాత్రి సమయాల్లో నగరంలో గంజాయి వినియోగించేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించడం జరుగుతుంది. ఇందు కోసం ఈ ప్రత్యేక విభాగం స్థానిక పోలీసులతో నిరంతరం గస్తీ కొనసాగించడంతో పాటు పోలీసులకు అందిన సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి గంజాయి సేవించే ప్రాంతాలపై మెరుపుదాడి చేసి గంజాయి ప్రియులను అదుపులోకి తీసుకోని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడే వ్యక్తులపై కూడా ఈ విభాగం పోలీసుల ప్రత్యేక నజర్ ఉంటుందని, ప్రధానంగా గంజాయి వినియోగంచే వ్యక్తులను కట్టడి చేయడం ద్వారా గంజాయి మత్తులో జరిగే నేరాలను అదుపు చేసేందుకు మరింత సులభమవుతుందని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ మత్తు పదార్థాల నియంత్రణతో పాటు యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా, ఈ గంజాయి మహమ్మారి మీ ఇంటి దరి చేరకుండా మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులతో పాటు ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రజలు పరోక్షంగా గంజాయి నియంత్రణలో భాగస్వాములు కావలసిన అవసరం ఉందని, ఇందుకోసం మత్తు పదార్థాలను సేవిస్తున్న, విక్రయిస్తున్న, రవాణా చేస్తున్న *8712584473* నంబర్ కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడటంతో పాటు అధిక మొత్తంలో గంజాయి సమాచారం అందించిన వారికి భారీగా నగదు పురస్కరం అందజేయబడుతుందని, గంజాయి రహిత పోలీస్ కమిషనరేటే మనందరి ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన తెలిపారు.