వరంగల్ బిడ్డ మరో ప్రపంచ రికార్డు
By DS
On
- 400 మీటర్ల టీ - 20 విభాగం ఫైనల్లో దీప్తికి కాంస్య పతకం
- స్వగ్రామం కల్లెడలో హర్షాతిరేకాలు
వరంగల్ జిల్లాకు చెందిన యువ అథ్లెట్ దీప్తి జివాంజీ మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. పారీస్ పారాలింపిక్స్‌లో తెలుగు తేజం దీప్తి జివాంజి చరిత్ర సృష్టించారు. పారాలింపిక్స్ హిస్టరీలో పతకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా రికార్డులకెక్కారు. బుధవారంరాత్రి జరిగిన 400 మీటర్ల టీ - 20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచారు. దీంతో ఆమెకు కాంస్య పతకం లభించింది. గత మే నెలలో జపాన్‌లోని కోబ్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక పారా అథ్లెటిక్స్ మహిళల 400 మీటర్ల టీ 20 కేటగిరీలో దీప్తి జివాంజీ 55.06 సెకన్లలోనే పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాంస్య పతకం సాధించడంతో దీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో సంబురాలు చేసుకున్నారు.
Tags:
About The Author
తాజా వార్తలు
ఎస్బీఐలో భారీ చోరీ
19 Nov 2024 13:18:14
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం దాదాపు 10 కిలోల బంగారం అపహరణ విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...