అత్యాచారం... హత్య

అత్యాచారం... హత్య

  • పక్కా ప్లాన్ తో అంగన్వాడీ టీచర్ హత్య
  • అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం 
  • తర్వాత గొంతుకు స్కార్ఫ్ చుట్టి మర్డర్ 
  • ఇద్దరు నిందితుల అరెస్టు
  • బంగారం నగలు, బైక్ స్వాధీనం 

అక్షర దర్బార్, తాడ్వాయి:

తాడ్వాయి మండలం కాటాపూర్ అడవిలో జరిగిన అంగన్వాడి టీచర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంగన్వాడి టీచర్ పై అత్యాచారం జరిపి ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులను ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అరెస్ట్ అయిన నిందితుల నుంచి ఒక మోటార్ సైకిల్, మూడు తులాల బంగారం గొలుసు, పుస్తెలు, వృద్ధురాలు హ్యాండ్ బాగ్, అందులో ఉన్న బ్యాంక్ పాస్ బుక్స్, ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటారం అడవిలో ఈనెల 14న అంగన్వాడీ టీచర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై ములుగు డీఎస్పీ శుక్రవారం వివరాలను వెల్లడించారు. ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో పనిచేస్తున్నారు. ఈనెల 14న కాటాపూర్ గ్రామంలో విధులను ముగించుకున్న అంగన్వాడీ టీచర్ చిన్నబోయినపల్లి గ్రామానికి వెళ్లేందుకు బయలుదేరారు. గ్రామంలో బస్సు మిస్ అవ్వడంతో అంతకుముందే పరిచయం ఉన్న ఆకుదారి రామయ్య తాను లిఫ్ట్ ఇస్తానని కాటాపూర్ గ్రామంలో ఆమెను బైకు ఎక్కించుకున్నాడు. అప్పటికే ఆకుదారి రామయ్య కాటాపూర్ సమీపంలోని అడవి వద్ద గల నీళ్ల ఒర్రె వద్ద పగిడి జంపయ్య అనే వ్యక్తిని బైక్ పై దించాడు. కాటాపూర్ నుంచి అంగన్వాడీ టీచర్ తో బైకు పై బయలుదేరిన ఆకుదారి రామయ్య అడవిలో నీళ్ల ఒర్రె వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ ఆకుదారి రామయ్య, పగిడి జంపయ్య ఇద్దరు కలిసి అంగన్వాడీ టీచర్ ను అడవిలో కొద్ది దూరం తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం జరిపారు. తర్వాత అంగన్వాడి టీచర్ మెడలో ఉన్న బంగారం గోపితాడును లాక్కునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించారు. ఆమె తలపై రాయితో కొట్టాడు. తర్వాత ఆ రాయిని నీళ్ల ఒర్రెలో పడేశాడు. ఆకుదారి రామయ్య ఆమె చాతిపై కూర్చుని గొంతు నొక్కాడు. తర్వాత ఇద్దరు కలిసి ఆమె స్కార్ఫ్ తో మెడ చుట్టూ ఇద్దరు కలిసి లాగి ఊపిరాడకుండా చేసి అంగన్వాడీ టీచర్ ను చంపారు. తర్వాత ఆమె మెడలోని మూడు తులాల బంగారం గొలుసు, పుస్తెలను తీసుకున్నారు. ఆమె మొబైల్ ఫోన్లని పక్కనే ఉన్న నీళ్ల ఒర్రెలో పడేశారు. ఆమె బ్యాగుని కూడా అడవిలో దూరంగా విసిరేశారు. తర్వాత ఆకుదారి రామయ్య, పగిడి జంపయ్యలు తమ స్వగ్రామమైన ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరు వెళ్లారు. మృతురాలి కొడుకు రడం చరణ్ ఫిర్యాదు మేరకు తాడ్వాయి పోలీసులు విచారణ చేపట్టారు. పస్రా ఇన్ స్పెక్టర్ వంగపల్లి శంకర్, తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డిల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సీసీ ఫుటేజీల, నిందితుల కాల్ డేటా ఆధారంగా పూర్తి ఆధారాలు సేకరించారు. శుక్రవారం నిందితులను ఇద్దరిని పట్టుకున్నారు. వీరిని పట్టుకోవడం, బంగారం రికవరీ, నిందితులు వాడిన వాహనం, రాయి, మృతురాలి వస్తువులను సీజ్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్ఐ చింత నారాయణ, హెడ్ కానిస్టేబుల్ కిషన్, హనుమాన్ పోలీస్ కానిస్టేబుళ్లు పూజారి రమేష్, జాజ సాంబయ్య, అప్పాల రమేష్, గోపు రాజీవ్, కాసగోని రాజేష్ లను ములుగు డీఎస్పీ అభినందించారు.

Tags:

About The Author

RV Picture

తాజా వార్తలు

ఎస్బీఐలో భారీ చోరీ ఎస్బీఐలో భారీ చోరీ
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం  దాదాపు 10 కిలోల బంగారం అపహరణ  విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...
దేశంలో బ‌లంగా కుల వివ‌క్ష‌..
టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌
డోంట్​ కేర్​.​.!
ధడేల్.. ధడేల్
వైట్ కాలర్స్‌లో విభిన్న స్పందన....
ఆగని ఇసుక జీరో దందా!
కాంగ్రెస్ లో ఫ్లెక్సీ వార్!
హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాలలు...
గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...
క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..
ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 
పసికందు అపహరణ!
వరంగల్ బిడ్డ మ‌రో ప్ర‌పంచ రికార్డు
ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు అగ్ర‌నేత జగన్ హ‌తం
హైడ్రా పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకే
వాగులో గ‌ల్లంతైన మోతీలాల్ మృత‌దేహం ల‌భ్యం..
వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌..
బిగ్ బ్రేకింగ్‌.. ఆకేరువాగులో సైంటిస్ట్ మృత‌దేహం ల‌భ్యం
జోరు వానలో ఎమ్మెల్యే పర్యటన
కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు గల్లంతు
భర్తను కట్టేసి.. భార్య గొంతు కోసి
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
సుధాకర్ రావు ప్రధమ వర్ధంతి...
పరకాలలో గంజాయి పట్టివేత..
ఏసీబీ వలలో ఎస్సై, పీసీ
ఔదార్యం చాటుకున్న కోగిల బ్రదర్స్.
షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో వస్తువులు దగ్ధం.
ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
పనిచేసిన షాపులోనే చోరీ - ఘరానా దొంగ అరెస్ట్ - రూ.52 లక్షల బంగారం రికవరీ - గోల్డ్ అమ్మే ప్రయత్నంలో పట్టుబడిన దొంగ
కమిషనరేట్ లో డ్రగ్స్ కంట్రోల్ టీమ్
చర్లపల్లిలో పిడిఎస్ బియ్యం పట్టివేత.....
బిల్డింగ్ పైనుంచి కిందపడిన గురుకుల విద్యార్థిని...
స్టడీ ఎంబీఏ... చేసేది సైబర్ నేరాలు
విజిలెన్స్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై లైంగిక దాడి
నాన్ లేఅవుట్..‌ ఫుల్ బెనిఫిట్
దుబాయ్ వెళ్లేందుకు చోరీలు!
కేసు దర్యాప్తులో అవకతవకలు
కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్ లు
ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్

ఈ-పేపర్‌