హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాలలు...
By AV
On
హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాలలు...
- కేక్ కటింగ్ కు ఎమ్మెల్యే హాజరు కాకపోవడం దేనికి సంకేతం...?
- నేతలలో వర్గ పోరు బహిర్గతమైందా...?*
అక్షర దర్బార్, కేసముద్రం
హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాలలు అగ్గి రాజేసుకుంటున్నాయా ?.అధికారంలో ఉండటంతో.. స్థానికంగా ఉన్న నేతల్లో పెద్దలు వ్యవహరించే తీరుతో కొంత అసహనానికి లోనవుతున్నారా?.ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యుడి తీరుతో.. పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రగిల్చిన ఘటన.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో చోటు చేసుకోవడం విశేషం.ఆదివారం మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళినాయక్ పుట్టినరోజు సందర్భంగా.. అన్ని మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఏర్పాట్లు చేశారు.ఇదే తరుణంలో.. కేసముద్రంలో సైతం మండల పార్టీ కమిటీ అందుకుతగ్గ ఏర్పాట్లు చేసుకుంది.మండలంలో పార్టీకి విధేయుడిగా ఉండి.. ఎమ్మెల్యే అనుచరుల్లో కీలకంగా ఉన్నటువంటి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అంబటి మహేందర్ రెడ్డి,మండల ముఖ్య నాయకులతో మండల పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు బర్త్ డే వేడుకల కోసం వేరువేరుగా ఏర్పాట్లు చేసుకున్నారు.మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో అంబటి ఏర్పాట్లు చేస్తే,స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్లో నాగేశ్వర్ రావు ఏర్పాట్లు చేశారు.గత కొంత కాలంగా నేతలు విడివిడిగా ఉండటం చాలా రోజులుగానే కొనసాగుతోంది.దీంతో.. ఎవరికి వారు.. ఎమ్మెల్యే బర్త్ డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చేశారు.మండల పార్టీ ముఖ్య నాయకులు అల్లం నాగేశ్వర్ రావు వద్ద ఉండగా... పలువురు కీలక నేతలు మహేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన వేదిక వద్ద హాజరయ్యారు.ఇక కేక్ కట్టింగ్‌కి రావాల్సిన శాసనసభ్యులు మురళి నాయక్.. మహేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన వేదిక వద్దకు హాజరయ్యి బర్త్ డే కేక్ ను కట్ చేశారు.అనంతరం.. మండల పార్టీ నాయకులు,మండల పార్టీ ప్రెసిడెంట్ అల్లం నాగేశ్వర్ రావు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వస్తారని అంతా అనుకున్నారు.కానీ.. ఎమ్మెల్యే మాత్రం నాగేశ్వర్ రావు వద్దకు వెళ్లకుండా.. గుడూరుకు వెళ్లారు.దీంతో.. మండలంలోని పార్టీ శ్రేణుల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఎమ్మెల్యే కావాలనే వెల్లారా.. ? లేక... ఉద్దేశపూర్వకంగానే అల్లం నాగేశ్వర్ రావు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రాలేదా అని పార్టీ నేతలు చర్చించకుంటున్నారు.గత కొంత కాలంగా.. అటు.. మార్కెట్ చైర్మన్ పదవి అంబటి మహేందర్ రెడ్డి ఆశించిన దక్కకపోవడంతో,ఇటు ఎమ్మెల్యే మండల పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రాకపోవడంతో పార్టీలోని శ్రేణులు.. ఎవరికివారుగా చెవులు కొరుక్కుంటున్నారు.ఈ వ్యవహరంతో.. మహేందర్ రెడ్డి,నాగేశ్వర్ రావు మధ్య ఉన్న వర్గపోరు బహిర్గతమైంది.ఈ చర్య.. దేనికి సంకేతమంటూ.. మండలంలో తీవ్ర చర్చకు దారి తీసింది.మరి డీసీసీ దీనిపై ఏవిధంగా స్పందిస్తుంది.. ఎమ్మెల్యే.. మండల పార్టీ నాయకులకు ఏవిధంగా నచ్చజెప్తారనేది ఆసక్తిగా మారింది....
Tags:
About The Author
తాజా వార్తలు
ఎస్బీఐలో భారీ చోరీ
19 Nov 2024 13:18:14
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం దాదాపు 10 కిలోల బంగారం అపహరణ విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...