వరదలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..
By DS
On
- సికింద్రాబాద్-విజయవాడ మధ్యనిలిచిపోయిన 25 రైళ్లు..
అక్షరదర్బార్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షానికి జనజీవనం అతలాకుతలం అయింది. రోడ్లు, రైల్వేలైన్లు దెబ్బతినడంతో ప్రజా రవాణా స్తంభించింది. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి సమీపంలో భారీ వర్షానికి రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. పట్టాలపై కంకర కొట్టుకుపోవడంతో తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్ వరదనీటితో నిండిపోయింది. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతో ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అంతేగాక సమీపంలోని విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగిపోయాయి. విజయవాడ కాజీపేట మార్గంలో ట్రాక్ పైకి వరద నీరు చేరడంతో 24 రైళ్లను నిలిపివేశారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్ ప్రెస్, గంగా-కావేరి, చార్మినార్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయాయి.
Tags:
About The Author
తాజా వార్తలు
ఎస్బీఐలో భారీ చోరీ
19 Nov 2024 13:18:14
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం దాదాపు 10 కిలోల బంగారం అపహరణ విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...