హైడ్రా పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకే

హైడ్రా పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకే

  • హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
  • ఓ బిల్డర్ను బెదిరించిన ఒకరి అరెస్ట్

హైడ్రా పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడితే జైలుకే

- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ 

అక్షర దర్బార్, హైదరాబాద్:
హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్ల పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం విస్తృతంగా అక్రమ నిర్మాణాల  తొలగింపులు చేపడుతున్న నేపథ్యంలో కొంతమంది సామాజిక కార్యకర్తల ముసుగులో బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్లను ఇది అక్రమ నిర్మాణమని, బఫర్ జోన్, ఎఫ్ టిఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని, హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని, అలాగే అధికారులతో ఉన్న ఫోటోలు చూపించి హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని, ఇందుకోసం కొంత డబ్బు ముట్టజెప్పాలని, లేదంటే హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని సంస్థలు, బిల్డర్లను బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కొంతకాలంగా బహుళ అంతస్తుల్లో, వ్యక్తిగత గృహల్లో నివాసం ఉంటున్న వారి వద్ద ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం జరుగుతోందని, ఇతర ప్రభుత్వ విభాగలైన రెవిన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సైతం ఎవరైనా కూడా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే  ప్రజలు, బిల్డర్లు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్ లో గాని, ఎస్పీ, సీపీకి లేదా హైడ్రా కమిషనర్, ఏసీబీకి కూడా ఫిర్యాదు చేయాలని హైడ్రా కమిషనర్ తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి మంచి ఉద్యేశాలతో ఈ హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా ఈ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేసిన, తప్పు దోవ పట్టించే విధంగా యత్నించే వారిపైన కూడా కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విభాగం పేరుతో ఎవరైనా వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బు వసూళ్లకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.

- హైడ్రా పేరుతో డబ్బు వసూళ్ళకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

ఈ బెదిరింపు వసూళ్లకు సంబంధించి సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డా. విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధిత బిల్డర్ గత సోమవారం హైడ్రా కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదును పరిశీలించి వాస్తవాలు గ్రహించిన అనంతరం హైడ్రా కమిషనర్  సూచన మేరకు సంగారెడ్డి ఎస్పీ బాధిత బిల్డర్ నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఈ ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న డా. విప్లవ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసారు. నిందితుడిని పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Tags:

About The Author

RV Picture

తాజా వార్తలు

ఎస్బీఐలో భారీ చోరీ ఎస్బీఐలో భారీ చోరీ
గ్యాస్ కట్టర్ తో కిటికీ తొలగింపు వెనుక నుంచి బ్యాంకు లోకి ప్రవేశం  దాదాపు 10 కిలోల బంగారం అపహరణ  విలువ సుమారు రూ.10 కోట్లని అంచనా ...
దేశంలో బ‌లంగా కుల వివ‌క్ష‌..
టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌
డోంట్​ కేర్​.​.!
ధడేల్.. ధడేల్
వైట్ కాలర్స్‌లో విభిన్న స్పందన....
ఆగని ఇసుక జీరో దందా!
కాంగ్రెస్ లో ఫ్లెక్సీ వార్!
హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాలలు...
గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...
క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..
ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 
పసికందు అపహరణ!
వరంగల్ బిడ్డ మ‌రో ప్ర‌పంచ రికార్డు
ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు అగ్ర‌నేత జగన్ హ‌తం
హైడ్రా పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకే
వాగులో గ‌ల్లంతైన మోతీలాల్ మృత‌దేహం ల‌భ్యం..
వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌..
బిగ్ బ్రేకింగ్‌.. ఆకేరువాగులో సైంటిస్ట్ మృత‌దేహం ల‌భ్యం
జోరు వానలో ఎమ్మెల్యే పర్యటన
కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు గల్లంతు
భర్తను కట్టేసి.. భార్య గొంతు కోసి
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
సుధాకర్ రావు ప్రధమ వర్ధంతి...
పరకాలలో గంజాయి పట్టివేత..
ఏసీబీ వలలో ఎస్సై, పీసీ
ఔదార్యం చాటుకున్న కోగిల బ్రదర్స్.
షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో వస్తువులు దగ్ధం.
ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
పనిచేసిన షాపులోనే చోరీ - ఘరానా దొంగ అరెస్ట్ - రూ.52 లక్షల బంగారం రికవరీ - గోల్డ్ అమ్మే ప్రయత్నంలో పట్టుబడిన దొంగ
కమిషనరేట్ లో డ్రగ్స్ కంట్రోల్ టీమ్
చర్లపల్లిలో పిడిఎస్ బియ్యం పట్టివేత.....
బిల్డింగ్ పైనుంచి కిందపడిన గురుకుల విద్యార్థిని...
స్టడీ ఎంబీఏ... చేసేది సైబర్ నేరాలు
విజిలెన్స్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై లైంగిక దాడి
నాన్ లేఅవుట్..‌ ఫుల్ బెనిఫిట్
దుబాయ్ వెళ్లేందుకు చోరీలు!
కేసు దర్యాప్తులో అవకతవకలు
కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్ లు
ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్

ఈ-పేపర్‌