ఇద్దరిని చంపిన మావోలు!
By RV
On
- ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య
- గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు
- మృతుల్లో ఒకరు పంచాయతీ కార్యదర్శి
- మృతదేహాల వద్ద లేఖ
అక్షరదర్బార్, వాజేడు: ములుగు జిల్లాలో మావోయిస్టులు పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇద్దరు వ్యక్తులను హతమార్చారు. వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన ఉయిక రమేష్, అర్జున్ ను గురువారం రాత్రి గుడ్డలతో నరికి హత్య చేశారు. మృతుల్లో ఒకరైన పెనుగోలు గ్రామస్తుడు రమేష్ ఇదే మండలంలోని పేరూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మృతదేహాల వద్ద మావోయిస్టులు లేఖలను వదిలారు. గతంలో హెచ్చరించినప్పటికీ పద్ధతి మార్చుకోకపోవడం వల్లే ఈ ఘటనకు పాల్పడినట్లు మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ములుగు జిల్లా, ఛత్తీస్ గడ్ సరిహద్దులో వరుస ఎన్ కౌంటర్లు జరిగిన నేపథ్యంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడటం సంచలనం కలిగించింది. స్థానికంంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Tags:
About The Author
తాజా వార్తలు
భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు
04 Dec 2024 08:39:46
ప్రకంపణల తీవ్రత రిక్టర్స్కేల్పై 5.3గా నమోదు ఉదయం 7:27 గంటలకు కొన్ని సెంకండ్లపాటు కంపించిన భూమి ఇండ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు అక్షరదర్బార్,...