భారీ ఎన్ కౌంటర్
- తెలంగాణ- చత్తీస్గడ్ సరిహద్దులో కాల్పులు
- ఎనిమిది మంది మావోయిస్టులు మృతి
- చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఘటన
భారీ ఎన్ కౌంటర్
- ఏడుగురు మావోయిస్టుల మృతి
అక్షరదర్బార్, ఏటూరునాగారం: తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలిసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఇవాళ జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్ జీఏ) ఆవిర్భవించి 24 సంవత్సరాలు అవుతున్న తరుణంలో డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వార్షికోత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి పీఎల్ జీఏ వార్షికోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒకరోజు ముందే చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పీఎల్ జీఏ వార్షికోత్సవాల దృష్ట్యా పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ మరింత విస్తృతం చేసిన క్రమంలో చెల్పాక- ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించగా కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం మృతుల వివరాలు...
మావోయిస్టు దళ కమండర్ తో పాటు ఏడుగురు నక్సల్స్ మృతి.
భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
మృతి చెందిన మావోయిస్టులు...
కుర్సం మంగు @ భద్రు @ పాపన్న, TSCM, సెక్రటరీ ఇల్లందు - నర్సంపేట AC, AK-
47 రైఫిల్.
ఈగోలపు మల్లయ్య @ మధు, DVCM,
కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏసీ, ఏకే-47 రైఫిల్
ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM,
ముస్సాకి జమున,
ACM, జైసింగ్, పార్టీ సభ్యుడు
కిషోర్, పార్టీ సభ్యుడు
కామేష్, పార్టీ సభ్యుడు