ఏసీబీ వలలో పీఆర్ ఏఈ
- రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ అడ్డంగా బుక్
- బిల్లు ఫైలు క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్
- వల పన్ని ఏఈని పట్టుకున్న ఏసీబీ అధికారులు
ఏసీబీ వలలో పీఆర్ ఏఈ
- రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ అడ్డంగా బుక్
అక్షరదర్బార్, వరంగల్: అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు మరింత పెంచారు. ప్రభుత్వ శాఖల్లో లంచవతారాలను వలపన్ని పట్టుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీరాజ్ ఇంజనీరు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఏఈ కార్తీక్ రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టు బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సతీష్ ను అసిస్టెంట్ ఇంజనీర్ కార్తీక్ డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో సతీష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ వద్ద సతీష్ నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏఈ కార్తీక్ ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కాడు. అనంతరం హనుమకొండలోని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.